ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణను టార్గెట్ చేస్తూ వైఎస్ విజయా రాజశేఖర్ రెడ్డి పేరుతో విడుదలైన లేఖను ఆయన సీరియస్‌గా తీసుకున్నారు. ఈ వారం కొత్త పలుకులో అత్యధిక భాగం విజయలక్ష్మి ఉరఫ్ విజయా రాజశేఖర్ రెడ్డికి కౌంటర్ ఇవ్వడానికే ప్రాధాన్యం ఇచ్చారు. అయితే ఆయన జర్నలిస్ట్. వైసీపీ రాజకీయాన్ని ఎలా తిప్పికొట్టాలో తెలిసిన జగమెరిగిన జర్నలిస్ట్. అందుకే ఆయన … విజయలక్ష్మికి సమాధానం ఇస్తున్నట్లుగా.. మొత్తం పాత చరిత్రనంతా తవ్వి తీశారు. జగన్మోహన్ రెడ్డి వ్యవహారశైలిపై ఆయన తండ్రికే కోపం ఉండేదన్న అంశం దగ్గర్నుంచి.. అసలు ఆ లేఖను కూడా జగనే తయారు చేశారని.. కానీ కొడుకు తప్పును ఆమె ఖండించడం లేదని పరోక్షంగా పాఠకుల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు.
జగన్మోహన్ రెడ్డి వ్యవహారశైలిపై అనేక రకాల ప్రచారాలు ప్రజల్లో ఉన్నాయి. వాటిల్లో నిజమెంతో కుటుంబసభ్యులకే తెలుసు. ఇప్పుడు.. అలాంటి ప్రచారాల్లో మరికొన్ని కీలకమైన అంశాలు విజయలక్ష్మికి ప్రశ్నల రూపంలో ప్రజల ముందు ఉంచారు. చనిపోయే ముందు అసలు జగన్‌ను ఇంటికే రావొద్దని వైఎస్ ఆదేశించారట.. అయినా వచ్చినందుకు వైఎస్ కేకరేశారని రాధాకృష్ణ వెర్షన్. నిజామా కాదా…చెప్పాలని విజయలక్ష్మిని రాధాకృష్ణ పదే పదే ప్రశ్నించారు. అదే సమయంలో… వైఎస్ మృతి అంశాన్ని కూడా ప్రస్తావించారు. రెండింటింకి ఇంటర్ లింక్ ఉందని.. తన రాతల ద్వారా చెప్పారు కానీ..నేరుగా చెప్పలేదు. రాజకీయ పార్టీల నేతలు చేసే ఆరోపణలు నేరుగా ఉంటాయి…కానీ రాధాకృష్ణ మాత్రం.. తాను వ్యక్తం చేసే అనుమాలు వేరు.. అందులో అర్థాలు వేరు అన్నట్లుగా ప్రజల్లోకి పంపారు.
ఈ వారం కొత్త పలుకు ఆర్ఠికల్ ద్వారా. ,.. వైఎస్ జగన్ ఫ్యామిలీలో విబేధాల గురించిమరింత ఎక్కువగా చర్చ జరిగేలా రాధాకృష్ణ ప్రయత్నిస్తున్నారని సులువుగానే అర్థం అవుతుంది. వైఎస్ విజయా రాజశేఖర్ రెడ్డి అనే పేరు ద్వారా వచ్చిన లేఖ ద్వారా… వైసీపీకి ఎంత లాభమో కానీ..,దాన్ని మరింత పకడ్బందీగా ఉపయోగించుకుంటున్నారు వేమూరి రాధాకృష్ణ. ఓ రకంగా ఇప్పుడు.. విజయలక్ష్మిని స్పందించాలని సవాల్ చేశారు. గతంలో చేసిన దాని కంటే తీవ్రమైన ఆరోపణలు చేశారు. గతంలో స్పందించినట్లుగా స్పందించకపోతే.. ఇప్పుడు… నెగెటివ్ టాక్ ప్రజల్లో వెళ్లే ప్రమాదం ఉంది. స్పందిస్తే మరింత రచ్చ చేస్తారు.