ఓ యువ హీరోతో ఓ సినిమా మొదలైంది. ఓ అమ్మాయికి దర్శకత్వ బాధ్యతలు అప్పగించారు. ఈ సినిమాకి ముందు నుంచీ ఎన్నో ఆటు పోట్లు. స్క్రిప్టు రెడీ అయినా, ఆ అమ్మాయిపై నమ్మకం లేకపోవడంతో పట్టాలెక్కలేదు. కానీ నిర్మాత నుంచి దర్శకురాలికి మంచి సపోర్ట్ దొరికింది. ఆయన గట్టిగా రికమెండ్ చేయడంతో.. సినిమా మొదలైంది. కొన్ని రోజులు షూటింగ్ సవ్యంగానే సాగింది. కానీ.. రషెష్ చూసుకున్నాక ఆపేశారు. చెప్పిందొకటి, రాసిందొకటి, తీసిందొకటి.. అన్నట్టు తయారైంది వ్యవహారం. కానీ.. నిర్మాత వదల్లేదు. ఏదోలా సర్ది చెప్పి సినిమా మళ్లీ మొదలెట్టారు. రీషూట్లు జరిగాయి. సెట్లో ఒక్కోసారి కెమెరామెన్, ఒక్కోసారి హీరో, వీరెవరూ కాదంటే నిర్మాత సైతం డైరెక్షన్లు చేసేస్తున్నారని వినికిడి. ఓరోజు ఓ సీన్ తీస్తే… రాత్రికి రషెష్ చూసుకుని, మళ్లీ ఉదయాన్నే రీషూట్లు కూడా మొదలెడుతున్నార్ట. ఎంత కష్టపడినా, ఎంతమంది దర్శకులైనా.. సినిమాకి అవుట్ పుట్ బాగా రావడం ప్రధానం. ఇంతమంది వంటగాళ్లు చేరి, వండేస్తున్న ఈ వంట.. ఎలా తయారవుతుందో??