ఎవరైనా మ్యాచ్‌లు ఎందుకు ఆడతారు..? గెలవడానికే ఆడతారు. కానీ ఓడిపోవడానికే ఆడితే ఎలా ఉంటుంది..?. నిజంగా ఓడిపోవడానికి ఎవరూ ఆడరు..కానీ మంగళవారం నాటి ముంబై, కోల్‌కతా మ్యాచ్ చూస్తే రెండు జట్లు ఓడిపోవడానికి ఆడినట్లుగా పరిస్థితి మారిపోయింది. మొదటగా ముంబై జట్టు… భారీ స్కోర్ చేసే అవకాశాన్ని చేజేతులా కాలదన్నుకుంటే… ఆ జట్టు విసిరిన లక్ష్యాన్ని ఆడుతూపాడుతూ… చేధించే స్టేజ్‌లో ఉన్న కోల్‌కతా చివరికి పరుగులు తీయడానికి బద్దకించి… ఓడిపోయింది. చివరికి ఓడిపోవాలన్న లక్ష్యంతో ఉన్న రెండు జట్లలో కోల్‌కతానే ఓడిపోయి గెలిచినట్లయింది. ఇలా కూడా మ్యాచ్‌లు జరుగుతాయా.. అని ఆశ్చర్యపోయే రీతిలో మంగళవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్ అందరి దృష్టిని ఆకర్షించింది.
మొదట బ్యాటింగ్ చేసిన ముంబై కోల్‌కతాకు 153 పరుగుల టార్గెట్ పెట్టింది. ఈ పరుగులను అవలీలగా చేధిస్తుందని అనుకున్న కోల్‌కతా అదే మూడ్‌లో చాలావరకూ వెళ్లింది. చివరికి పది పరుగుల తక్కువే చేయగలిగింది. నిజానికి కోల్ కతా ఓడిపోతుదందని ఏ దశలోనూ ఎవరూ అనుకోలేదు. పదిహేను ఓవర్లలోనే స్కోరు 120 దాటిపోయింది. కానీ ఆ తర్వతా వరుసగా వికెట్లను కోల్పోయింది. పరుగులూ చేయలేపోయారు. చివరి ఐదు ఓవర్లలో అసలు పరుగులు కొట్టాలన్న సంగతినే కోల్ కతా ఆటగాళ్లు మర్చిపోయారు. నాలుగు ఓవర్లలో పదహారు పరుగులు వచ్చాయి. చివరి ఓవర్లో పదిహేను పరుగులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. నాలుగు ఓవర్లకే ఆ పరుగులు చేయని వారు.. ఒక్క ఓవర్‌కు ఎలా చేస్తారు. సహజంగానే చేయలేదు. దాందో పది పరుగుల తేడాతో ఓడిపోయింది. ఆఖరి ఆరు ఓవర్లలో వాళ్లు ఒక్క ఫోర్ మాత్రమే కొట్టగలిగారంటే.. బ్యాటింగ్ పట్ల ఆ ఆటగాళ్లు ఎంత నిరాసక్తంగా ఉన్నారో తేలిపోతుంది.
అంతకు ముందు ముంబై కూడా.. అదేగో గట్టి కష్టమైన పిచ్ అని ఫీలింగ్ కల్పించేందుకు ప్రయత్నించింది. భారీ స్కోర్ చేసే అవకాశం వచ్చినా.. అతి కష్టం మీద పరుగులు చేసినట్లుగా ఆడారు. చివరికి 152 దగ్గర సర్దుకున్నారు. మొదటి మ్యాచ్ అత్యంత ఉత్కంఠగా సాగడంతో ఈ ఐపీఎల్ ఓపెనింగ్స్ అదుర్స్ అనుకున్నారు. కానీ… ఆటగాళ్ల ఆట తీరు అసాధారణంగా ఎప్పటికప్పుడు మారిపోతూండటం… మ్యాచుల్లో ఫలితాలు అనూహ్యంగా ఉండటంతో ప్రేక్షకుల్లో కూడా… ఐపీఎల్ చాలా తేడా గురూ అనుకునేలా చేస్తోంది.