తిరుపతిలో బీజేపీకి ఎమైనా కాస్తంత సానుకూల ఫలితం వస్తే.. దానికిసంబంధించి పూర్తి క్రెడిట్ తమకే దక్కేలా సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి.. ప్లాన్ చేసుకున్నారు. ఎక్కడ చూసినా తామే కనిపించేలాచూసుకున్నారు. ఇతర నేతల వాయిస్ ఎక్కడా వినిపించనీయడం లేదు. తిరుపతిలో బీజేపీ ప్రచార శైలి చూసిన ఇతర పార్టీల నేతలు… సొంత పార్టీలో ఉన్న బీజేపీ నేతలు.. ముక్కున వేలేసుకుంటున్నారు. ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి హోదాలో ఉన్న సోము వీర్రాజు.. పార్టీ యంత్రాంగం మొత్తాన్ని తిరుపతిలో మోహరించి.. పక్కా ప్రణాళికతో ప్రచారం చేయాల్సి ఉంది. కానీ సోము వీర్రాజు..బాగా నోరున్న నేతలు ఎక్కడ ప్రచారం చేస్తే.., వారుఎక్కడ హైలెట్ అవుతారని అనుకున్నారో కానీ..చాలా మందిని పక్కన పెట్టేశారు. ఎవరికీ పెద్దగా మాట్లాడే చాన్సివ్వడం లేదు. ఇంటింటి ప్రచారం చేసేందుకు తిప్పుతున్నారు కానీ.. వారి వాయిస్ బయటకు రానీయడం లేదు.
సామాజికవర్గ సమీకరణాల్ని చూసుకుని… కొంత మంది నేతలు అంతో ఇంతో ప్రభావితం చేయగలనేతలు ఉన్నా… వారిని దూరంగానే ఉంచారు. సాదినేని యామిని శర్మ, రావెల కిషోర్ బాబు సహా పలువురు గతంలో రాష్ట్ర వ్యాప్తంగా చిరపరిచితమైన వాళ్లు ఆ పార్టీలో ఉన్నారు. వారిని ఏ మాత్రం ఉపయోగించుకోవడం లేదు. అలాగే సామాజికవర్గాల ప్రకారం తిరుపతి నియోజకవర్గంలో అంతో ఇంతో ప్రభావం చూపగలవాళ్లు ఉన్నా… లైట్ తీసుకున్నారు. ఎవరికీ పెద్దగా బాధ్యతలు ఇవ్వడం లేదు. ప్రెస్ మీట్లు కూడాఎక్కువగా పెడుతున్నారు కానీ.. ఆ ప్రెస్మీట్లలో మాట్లాడేది సోము వీర్రాడు లేకపోతే విష్ణువర్ధన్ రెడ్డి.
జనసేన మద్దతుతో బీజేపీకి గతం కన్నా ఎక్కువ ఓట్లు వస్తాయన్న నమ్మకంతో బీజేపీ నేతలు ఉన్నారు. ఎంత బలం పుంజుకున్నా.. అది తమ కష్టమేనని చెప్పుకునేందుకు సోము, విష్ణువర్ధన్ రెడ్డి ఓ కోటరీలాగా ఏర్పడి… కీలకమైన నేతల్ని దూరం పెడుతున్నారన్న చర్చ వినిపిస్తోంది. అదే సమయంలో వీరిద్దరూ.. ఎన్నికల ఖర్చుల కోసం… పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలపై ఒత్తిడి పెంచుతున్నారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ విషయం హైకమాండ్‌కు కూడా తెలిసిందని.. ఎన్నికల తర్వాత వారి వ్యవహారంపై దృష్టి పెడతారన్న చర్చ కూడా నడుస్తోంది. ఓ వైపు బీజేపీకి మద్దతుగా బలమైన ప్రచారం చేయకపోవడం తోడు.. వారిచేస్తున్న వ్యవహారాలు… వైసీపీకి మేలు కలిగేలా ఉండటం జనసేన వర్గాల్ని కూడా ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అందుకే రాను రాను ఎన్నికల ప్రచారంలో వారి కంట్రిబ్యూషన్ తగ్గిపోయింది.