క్రికెట్ అంటేనే విచిత్రం. ఎప్పుడు ఎలాంటి ఫలితాలు వస్తాయో చెప్పలేం. అందుకు ఐపీఎల్ లో భాగంగా సాగిన ముంబై – కొలకొత్తా మ్యాచ్‌నే ఉదాహరణ. ముంబైపై ఈజీగా గెలుస్తుందనుకున్న కొలకొత్తా.. అనూహ్యంగా వికెట్లు కోల్పోయి.. ముంబైకి మ్యాచ్ అప్పగించింది. 24 గంటలు గడవక ముందే. అదే సీన్ రిపీట్ అయ్యింది. బెంగళూరు – హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్… క్రికెట్ ప్రేమికుల్ని విస్మయ పరిచింది. 150 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ ఓ దశలో సునాయాసంగా విజయం సాధిస్తుందనిపించింది. అయితే అనూహ్యంగా వికెట్లు కోల్పోయి.. 6 పరుగుల తేడాతో ఓడిపోయింది. 150 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ ఓ దశలో ఒక వికెట్ కోల్పోయి 96 పరుగులు చేసింది. రెండు ఓవర్ల ముందే.. హైదరాబాద్ విజయం సాధిస్తుందనుకుంటే, అనూహ్యంగా హైదరాబాద్ కుప్పకూలింది. బ్యాటింగే రానట్టు.. ఒకరి వెంట ఒకరు పెవీలియన్ కి చేరారు. షబ్నాజ్ ఒకే ఓవర్లో 3 వికెట్లు కోల్పోయింది. చివరికి విజయలక్ష్యానికి 6 పరుగుల దూరంలో ఆగిపోయింది. ముంబై – కొలకొత్తా మ్యాచ్… అనూహ్యమైన ఫలితాన్ని తీసుకురావడంతో… క్రికెట్ ప్రేమికులు విస్మయ పడ్డారు. ఇదేమైనా ఫిక్సింగా అన్నట్టు అనుమానించారు. సరిగ్గా హైదరాబాద్ – బెంగళూరు మ్యాచ్ కూడా అలానే సాగింది. ఇప్పుడేమంటారో?????