కరోనా సెకండ్ వేవ్ ప్రభావం సినిమా పరిశ్రమపై గట్టిగా పడింది. వరుసగా సినిమాలన్నీ వాయిదా పడుతూ వస్తున్నాయి. అన్నీ బాగుంటే.. ఈపాటికి `లవ్ స్టోరీ` విడుదల కావాల్సింది. కానీ.. నిరవధికంగా ఈ సినిమాని వాయిదా వేశారు. ఇప్పుడు కొత్త డేట్ ఫిక్స్ చేసినట్టు టాక్. మే 13న `లవ్ స్టోరీ`ని తీసుకురావాలన్నది దర్శక నిర్మాతల ప్రయత్నం.
నిజానికి మే 13న `ఆచార్య` ఫిక్సయ్యింది. అయితే.. ఆచార్య వాయిదా పడే అవకాశాలు పుష్కలంగా ఉండడంతో… ఆ డేట్ ని వాడుకోవాలని `లవ్ స్టోరీ` టీమ్ చూస్తోంది. అప్పటికి కరోనా వేవ్ కాస్త తగ్గుతుందన్న ఆశాభావం ఉండడం, 50 శాతం ఆక్యుపెన్సీలాంటి ప్రమాదాలు ఉండవన్న సంకేతాలు రావడంతో… `ఆచార్య` డేట్ లో లవ్ స్టోరీ తీసుకురావాలని చిత్రబృందం భావిస్తున్నట్టు తెలుస్తోంది. దాదాపు ఈ డేట్ ఫిక్సయ్యే ఛాన్సులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాకపోతే.. అధికారిక ప్రకటన మాత్ర రావాలంతే.