తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా అన్నింటికంటే హైలెట్ గా నిలిచిన అంశం ఏదైనా ఉంది అంటే అది వందలాది మంది వ్యక్తులు దొంగ ఓటు వేయడానికి వచ్చి మీడియా ఛానల్ కెమెరాలకు అడ్డంగా దొరికిపోవడమే. దాదాపు అన్ని చానల్స్ లో లైవ్ లో ప్రసారమైన ఈ తంతు కారణంగా అధికార వైఎస్ఆర్సిపి పార్టీ పరువు పోగొట్టుకున్నట్లు అయింది . వివరాల్లోకి వెళితే..
తిరుపతి ఉప ఎన్నికల సందర్భంగా అనేక చోట్ల మీడియా ఛానల్స్ పోలీసులు చేయవలసిన పని చేశాయి. దొంగ వేటు వేయడానికి వచ్చిన వారిని మీడియా వారే గుర్తించి వారి దగ్గర కెమెరా మైక్ పెట్టి తండ్రి పేరు ఏంటి, వీధి ఏంటి వంటి ప్రశ్నలు వేస్తే, అనేకమంది సమాధానాలు చెప్పడానికి తడబడ్డారు. తండ్రి పేరు చెప్పడానికి తడబడి, కార్డులో లో ఉంది కదా చూసుకో అని మీడియా రిపోర్టర్ తో చెప్పిన వారు కొందరైతే, సమాధానాలు చెప్పలేక అక్కడి నుండి గబగబా నిష్క్రమించిన వారు మరికొందరు. మరొక చోట ప్రైవేటు వాహనంలో ఉన్న స్త్రీలు తాము వేరే ఊరి నుండి ఓటు వేయడానికి తిరుపతికి వచ్చామని మీడియాతో అంగీకరించడం ఇంకొక తంతు.
అయితే నిన్నమొన్నటిదాకా సంక్షేమ కార్యక్రమాలు తమను గెలిపించి తీరుతాయని బలంగా వాదిస్తూ వచ్చిన అధికార వైఎస్ఆర్సిపి పార్టీ, ఈ స్థాయిలో జనాలను తరలించడం, అక్రమాలకు పాల్పడటం తటస్థ ఓటర్లను సైతం విస్మయపరిచింది. ఇప్పటికే టిడిపి బిజెపి సహా అన్ని పార్టీల నేతలు అధికార వైఎస్ఆర్సిపి పార్టీ కనివిని ఎరుగని రీతిలో అక్రమాలు చేసిందని ఎలక్షన్ కమిషనర్ కి ఫిర్యాదు చేశారు. జగన్ కి తన పాలన మీద నమ్మకం లేకనే ఈ విధమైన అక్రమాల కు పాల్పడ్డారని బిజెెెెపి అభ్యర్థి రత్నప్రభ ఆరోపించారు. నెటిజన్ లు మాత్రం, తెలంగాణలో నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ఎటువంటి అవకతవకలు లేకుండా ప్రశాంతంగాా జరిగితే ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఉప ఎన్నిక లో మాత్రం ఈ స్థాయి ఆరోపణ లు, అది కూడా వీడియోో సాక్ష్యాలతో బయటకి రావడం కెసిఆర్ తో పోలిస్తే జగన్ ఎంత పిరికితనం తో వ్యవహరిస్తున్న్నాడో నిరూపిస్తోంది అనిి వ్యాఖ్యానిస్తున్నారు.
ఏది ఏమైనా ఒక్క తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా జరిగిన దొంగ ఓట్ల ఆరోపణల వ్యవహారం అధికార వైఎస్ఆర్సిపి పార్టీకి తలవంపులు తెచ్చినట్లు అయిందని సోషల్ మీడియా లో ప్రచారం జరుగుతోంది.