సుకుమార్ ప్రస్తుతం `పుష్ష` తో బిజీగా ఉన్నాడు. ఆ తరవాత… విజయ్ దేవరకొండతో ఓసినిమా చేయాలి. అయితే ఈ సినిమాపై కొన్ని రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమా ఆగిపోయిందని, విజయ్ స్థానంలో… రామ్ చరణ్ వచ్చి చేరాడన్నది ఆ వార్తల సారాంశం. సినిమాలు చేతులు మారడం ఈమధ్య సర్వసాధారణమైన విషయం కాబట్టి, ఇది కూడా నిజమే అనుకుంటున్నారంతా.
అయితే ఇప్పుడు చిత్రబృందం ఈ ప్రాజెక్టుపై క్లారిటీ ఇచ్చింది. సుకుమార్ – విజయ్ దేవరకొండ కాంబో ఆగిపోలేదని, అనుకున్న షెడ్యూల్ ప్రకారమే ఈ సినిమా మొదలవుతుందని స్పష్టం చేసింది. ఈ సినిమాపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని కాస్త గట్టిగానే ఖండించింది. ముందే చెప్పినట్టు.. ఈ కాంబోలో అతి పెద్ద సినిమా రాబోతోందని, అందుకు అనుగుణంగానే తమ ప్రణాళికలు సాగుతున్నాయని తేల్చి చెప్పింది. సో.. పుష్ష తరవాత సుకుమార్ సినిమా విజయ్ తోనే. ఇందులో మరో మాటకు తావులేదన్నమాట.