మలయాళ `లూసీఫర్`ని చిరంజీవి తెలుగులో రీమేక్ చేయడానికి రెడీ అయిన సంగతి తెలిసిందే. ఈమధ్యే లాంఛనంగా ప్రారంభమైంది. తమిళ దర్శకుడు మోహన్ రాజా.. ఈ చిత్రాన్ని టేకప్ చేస్తున్నాడు. చెన్నైలో స్క్రిప్టు పనులు జరిగిపోయాయి. ఈ సినిమా కోసం `రారాజు`, `కింగ్ మేకర్` లాంటి పేర్లు కూడా అనుకున్నారు. నిజానికి ఏప్రిల్ తొలి వారంలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లాల్సింది. కరోనా కారణంగా షూటింగులు ఆగిపోతున్న నేపథ్యంలో దానికీ బ్రేక్ పడింది. అయితే ఈ సినిమా ఆగిపోవడానికి కరోనా ఒక్కటే కారణం కాదు. చాలా కారణాలున్నాయి. స్క్రిప్టు విషయంలో చిరు ఇప్పటికీ సంతృప్తిగా లేడట. కథలో చాలా మార్పులూ చేర్పులూ జరిగాయని, అవన్నీ చిరుకి పెద్దగా రుచించడం లేదని తెలుస్తోంది. మార్పులు ఎక్కువైపోతే, లూసీఫర్ ఫ్లేవర్ పూర్తిగా మారిపోతోందేమో అన్న అనుమానాలూ.. కలుగుతున్నాయట. అందుకే తాత్కాలికంగా హోల్డ్ చేసినట్టు సమాచారం. `ఆచార్య` పనులన్నీ పూర్తయ్యాక.. చిరు ఈ స్క్రిప్టు పై శ్రద్ధ చూపిస్తారని, అప్పటి వరకూ లూసీఫర్ హోల్డ్ లోనే ఉంటుందని టాక్.