దేశంలో ప్రస్తుతం ఉన్న అత్యంత సమర్థవంతమైన వ్యాక్సిన్లలో మొదటి స్థానం కోవాగ్జిన్‌కు లభిస్తుందని ఐసీఎంఆర్ ప్రకటించారు. కోవాగ్జిన్ మూడో దశ ఫలితాలను ఐసీఎంఆర్ ధృవీకరించింది. కరోనా వైరస్ మ్యుటేషన్లపైనా కొవాగ్జిన్ సమర్థంగా పని చేస్తోందని.. డబుల్ మ్యుటెంట్ స్ట్రెయిన్లనూ కొవాగ్జిన్ నియంత్రిస్తోందని ఐసీఎంఆర్ స్పష్టం చేసింది. మ్యుటేషన్లు, డబుల్ స్ట్రెయిన్లనూ సమర్థవంతంగా ఎదుర్కొంటూ.. వంద శాతం రక్షణ ఇస్తోందని గుర్తించారు. దేశంలో ఇప్పటికే రెండు టీకాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఒకటి సీరం ఇనిస్టిట్యూట్ ఉత్పత్తి చేస్తున్న కోవిషీల్డ్ . మరొకటి భారత్ బయోటెక్ పరిశోధించి సిద్ధం చేసిన కోవాగ్జిన్. కోవిషీల్డ్ ఆక్స్ ఫర్డ్ టీకా . ఇండియాలో ఉత్పత్తి చేస్తున్నారు.
అయితే కోవాగ్జిన్ మాత్రం వంద శాతం భారతీయ టీకా. ఇప్పటి వరకూ కోవాగ్జిన్ మూడో దశ ఫలితాలు రాలేదు. అత్యవసర వినియోగం కింద మాత్రమే ఉపయోగిస్తున్నారు. అత్యవసర అనుమతి ఇచ్చి… టీకాలు పంపిణీ చేస్తున్నారు. ఇప్పుడు మూడో దశ ఫలితాలు రావడం… 78 శాతం సమర్థత ఉన్నట్లుగా తేలడంతో మరింత విస్తృతంగా కోవాగ్జిన్ ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం భారత్ బయోటెక్‌కు రూ. పదిహేను వందల కోట్ల రుణం ఇచ్చేందుకు అంగీకరించింది. దీంతో.. హైదరాబాద్, బెంగళూరు ప్లాంట్లలోనూ పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసి.. ఏటా 70 కోట్ల డోసులను ప్రజలను అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు.
ఇతర దేశాల వ్యాక్సిన్లు.. ఇండియాలో అమ్ముకునేందుకు కేంద్రం అనుమతి ఇస్తోంది. అయితే.. రేట్లు ఎక్కువగా ఉంటాయి. కానీ కోవాగ్జిన్ రేటు తక్కువగా ఉంటుంది. అత్యంత సమర్థమవంతమైనది కూడా. కోవాగ్జిన్ పనితీరుతో… టీకాలపై ఎవరికైనా అనుమానాలుంటే తీరిపోతాయని భావిస్తున్నారు.