టీకా పంపిణీ విషయంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న విధానాలు సామాన్య ప్రజలను ఆశ్చర్య పరుస్తూంటే రాష్ట్రాల ప్రభుత్వాలను నివ్వెర పరుస్తున్నాయి. అందరికీ వ్యాక్సిన్ ఫ్రీ అని ఎన్నికల్లో ప్రకటించేసిన పార్టీలు…ప్రభుత్వాలు మాత్రం మాత్రం.. పద్దెనిమిదేళ్లు నిండిన వారు కొనుగోలు చేసుకోవాలని షరతు పెడుతున్నారు. అదీ కూడా భారీ ధరలు నిర్ణయించారు. దీనిపై తెలంగాణ మంత్రి కేటీఆర్ .. మొదటి సారిగా నోరు విప్పారు. కేంద్రంపై సూటి ప్రశ్నలు సంధించారు. రాష్ట్రాలకు రేట్లు ఎందుకు ఎక్కువని ప్రశ్నించారు.. ? వన్ నేషన్.. వన్ టాక్స్ పేరుతో రాష్ట్రాలన్నీ జీఎస్టీకి అంగీకరించినప్పుడు.. రేట్లు ఎందుకు తేడాలు వస్తాయని ఆయనసూటిగానే ప్రశ్నించారు. ఒక వేళ తేడా ఉంటే.. ఆ మొత్తాన్ని పీఎం కేర్స్ ఫండ్ నుంచి ఎందుకు భరించరని ప్రశ్నించారు.
కేటీఆర్ ట్వీట్‌కు విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య..పక్షపాత వైఖరి కారణంగా రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. కానీ గట్టిగా అడిగేవారు లేకపోవడంతో.. వారు ఆడింతే ఆట..పాడిందే పాటఅయింది. ఈ సారి వ్యాక్సిన్ల వ్యవహారంలో కేటీఆర్ నేరుగా స్పందించడంతో ఆయనకు మద్దతు లభిస్తోంది.ఇతర రాష్ట్రాలుకూడా.. కేటీఆర్ వాయిస్‌తో జత కలవాలన్న సూచనలు వెళ్తున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ఈ అంశంపై స్పందించాలని పలువురు సూచిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి .. ప్రజలందరికీ టీకాలు ఇప్పించాలన్న లక్ష్యంతో ఉన్నారు. ఏపీలో ప్రజలు టీకాలు కొని వేయించుకునే పరిస్థితి లేదు. ప్రభుత్వం సరఫరా చేయాలి. నలభై ఐదేళ్లు దాటిన వారికి సరఫరా చేయడానికే తగినంత స్టాక్ లేదు. అదే సమయంలో మొదటి డోస్ వేసుకుని రెండు నెలలు దాటిన తర్వాత రెండో డోస్ ఇస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల వల్ల వ్యాక్సినేషన్ స్ఫూర్తి దెబ్బతింటుందని .. జగన్ కూడా ఆందోళన చెందుతున్నారు. వీటన్నింటికీ పరిష్కారం.. వ్యాక్సిన్‌ను సొంతంగా సేకరించుకుని ప్రజలకు వేయడమే.
ఏపీ సీఎం జగన్ ప్రజల్ని టీకాలు కొనుగోలు చేయమని చెప్పే ప్రయత్నం చేయరని అనుకుంటున్నారు. ఎంత ఖర్చు అయినాప్రభుత్వమే భరించి అందరికీ టీకాలు వేస్తుందని నమ్ముతున్నారు. ఇలాంటి సమయంలో.. ప్రభుత్వంపై భారం పడకుండా ఉండాలన్నా.. కేటీఆర్‌తో పాటు గొంతెత్తాల్సి ఉంటుంది. అలా చేస్తేనే కేంద్రంపై ఒత్తిడి పెరిగి ధరల విషయంలో ఆలోచిస్తారని అంటున్నారు. అయితే.. జగన్మోహన్ రెడ్డి కి కొన్ని రిజర్వేషన్స్ ఉన్నాయి. ఈ కారణంగా స్పందిస్తారో లేదోనన్న సందేహం ఉంది.
అలాగే… బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎలాగూ నోరెత్తరు. నోరెత్తే అవకాశం ఉన్న తమిళనాడు. కేరళ రాష్ట్రాల్లో ఇటీవలే ఎన్నికలు ముగిశాయి. ఫలితాలు వచ్చి కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే్ అక్కడ మళ్లీ రాజకీయ నేతలు యాక్టివ్ అవుతారు. అయితే కేరళ మాత్రం…ధరల సంగతేమో కానీ.. తమ ప్రజలకు ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించుకుంది. కేటీఆర్‌తో కలిసి ఎంత ఎక్కువగా కేంద్రం వ్యాక్సిన్ రేట్ల విధానాన్ని వ్యతిరేకిస్తారో.. అంత ఎక్కువగా ఫలితం ఉంటుంది. లేకపోతే..అది ప్రభుత్వంపైన.. అంతిమంగా ప్రజలకే భారం అవుతుంది.