తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ధూళిపాళ్ల నరేంద్ర సంగం డెయిరీ చైర్మన్ గా ఉన్నారు. ఆ సంగం డెయిరీలో అవకతవకలు జరిగాయని.. ఎవరో ఫిర్యాదు చేస్తే.. ఏసీబీ కేసులు నమోదు చేసింది. అందులో నాన్ బెయిలబుల్ సెక్షన్లు ఉన్నాయి. ఏమి విచారణ చేశారో… తెలియదు కానీ… ఉదయమే.. ఆయన ఇంటిని వంద మందిని పోలీసులు చుట్టుముట్టారు. ధూళిపాళ్ల నరేంద్ర .. తన స్వగ్రామం చింతలపూడిలో ఉంటారు. ఆ గ్రామంలోకి వందల మంది పోలీసులు ఉదయమే చుట్టుముట్టి ఎందుకు అరెస్ట్ చేస్తున్నామో కూడా చెప్పకుండా … కుటుంబసభ్యులకు కూడా వివరంగా చెప్పకుండా అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోయారు. తీసుకెళ్లే సమయంలో నరేంద్ర సతీమణినకి నోటీసులు ఇచ్చారు. నాన్ బెయిలబుల్ కే్సులు నమోదయిందని.. అరెస్ట్ చేస్తున్నామని అందులో ఉంది.
ఎవరినైనా అరెస్ట్ చేయాలంటే ఓ ప్రాసెస్ ఉంటుంది. నోటీసులు జారీ చేస్తారు. విచారణ చేస్తారు. విచారణకు సహకరించకపోతేనో.. అరెస్ట్ చేయక తప్పదనుకుంటేనో చేస్తారు. కానీ ఏపీలో పోలీసులు… టీడీపీ నేతల విషయంలో అలాంటివేమీ పట్టించుకోవడం లేదు. తెల్లవారు జామున వచ్చిన అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోతున్నారు. నిన్నగాక మొన్న దేవినేని ఉమపై.. జగన్ మాట్లాడిన వీడియోను ప్రదర్శించినందుకే సీఐడీ కేసు పెట్టి.. కర్నూలు రావాలని నోటీసులు జారీ చేసింది. ఆయన కోర్టుకెళ్లి అరెస్ట్ చేయకుండా ఉత్తర్వులు తెచ్చుకున్నారు. అలాంటి న్యాయపోరాటం ధూళిపాళ్ల నరేంద్ర ఎక్కడ చేస్తారో.. ఆయన్ను తప్పకుండా జైలుకు పంపాలని నిర్ణయించుకున్నారేమో కానీ ఉదయాన్నే విరుచుకుపడ్డారు. నిజానికి సంగం డెరీలో అవకతవకలపై కేసులు నమోదయ్యాయని.. ఎవరికీ తెలియదు. కానీ కేసులు నమోదు చేసి.. ఆధారాలు ఉన్నా లేకపోయినా అరెస్ట్ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు కాబట్టి పని పూర్తి చేశారని అంటున్నారు.
తెలుగుదేశం పార్టీలో యాక్టివ్గా ఉంటున్న నేతలందరిపైనా అరెస్ట్ కత్తి వేలాడుతోంది. ఏదో ఓ కేసు పెట్టి కొన్నాళ్లయినా జైల్లో పెట్టాలన్న లక్షంతో..ప్రభుత్వ పెద్దలు కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారని కొంత కాలంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో టీడీపీ నేతలు కూడా.. మానసికంగా అరెస్టులకు సిద్ధమయ్యారు. చాలా మంది సైలెంట్ అయిపోయారు. ప్రభుత్వంపై యాక్టివ్గా పోరాటం చేస్తున్నవారు టార్గెట్ అవుతున్నారు. వారికి న్యాయపోరాటం చేసే చాన్స్ కూడా ఇవ్వకుండా… అప్పటికప్పుడు అరెస్టులు చేస్తున్నారు. అరెస్టుల్లో కనీస ప్రక్రియ కూడాపాటించడం లేదు.