`ఆహా` లో కాస్ట్లియస్ట్ వెబ్ సిరీస్‌గా `లెవెన్త్ అవర్`ని తీసుకొచ్చారు. తమన్నా ప్రధాన పాత్రధారి కావడంతో.. ఈ సిరీస్ పై దృష్టి పడింది. అయితే… ఈ ప్రయత్నం ఫలించలేదు. ఓటీటీ లవర్స్ ని ఈ వెబ్ సిరీస్ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. కార్పొరేట్ రాజకీయాల నేపథ్యంలో సాగిన ఈ కథ… రుచించలేదు. దాదాపు 9 కోట్లతో ఈ వెబ్ సిరీస్ ని రూపొందించినట్టు టాక్. ఈ సిరీస్ సక్సెస్ అయితే… `లెవెన్త్ అవర్` సీజన్ ని కొనసాగించాలని ఆహా భావించింది. అందుకోసం తమన్నాతో ఓ ఎగ్రిమెంట్ కూడా చేయించుకుంది. అయితే ఆ సిరీస్ ఫ్లాప్ అవ్వడంతో.. తన్నాతో మరో సిరీస్ ప్లాన్ చేస్తోంది ఆహా. అందుకోసం ఓ స్క్రిప్టు కూడా సిద్ధం చేసింది. మెగా కాంపౌండ్ తో అనుబంధం ఉన్న ఓ దర్శకుడు.. ఈ వెబ్ సిరీస్ ని డీల్ చేస్తాడని తెలుస్తోంది. దీంతో పాటుగానే తమన్నాతో ఓ టాక్ షో లాంటిది కూడా ప్లాన్ చేయాలన్నది ఆహా ఆలోచన. ఇప్పటికే సమంతతో ఓ టాక్ షో నిర్వహించింది. దానికి మంచి స్పందనే వచ్చింది. తమన్నా టాక్ షో కూడా వెరైటీగా జనంలోకి తీసుకెళ్లాలన్నది ఆహా ఆలోచన.