ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ వారాంతపు ఆర్టికల్ కొత్తపలుకులో తెలుగుదేశం నేతల అరెస్టుల గురించి అనూహ్యమైన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నేతలందర్నీ అరెస్టులు చేసేదాకా…సీఎం జగన్ ప్రశాంతంగా నిద్రపోయే పరిస్థితి లేదని.. ఆయన ప్రశాంతంగా నిద్రపోతే తప్ప… ప్రజల అకౌంట్లలో డబ్బులేసే పని తప్ప ఇంకేమీ చేయరని.. అందుకే ఆయన హిట్‌లిస్ట్‌లో పెట్టుకున్న టీడీపీ నేతలందరూ స్వచ్చందంగా అరెస్ట్ అయిపోవాలని సలహా ఇచ్చారు. కాస్త అతిశయోక్తిగా ఉన్నా… ఏపీ సీఎం జగన్… టీడీపీ నేతలపైకి ఏసీబీ, సీఐడీలను ప్రయోగిస్తున్న తీరు చూసి ప్రజలు కూడా అదే అనుకుంటున్నారు. అయితే స్వచ్చందంగా అరెస్ట్ అయిపోవడం అన్న కాన్సెప్టే కాస్త చిత్రంగా ఉంది.ఎందుకంటే… జగన్మోహన్ రెడ్డి హిట్ లిస్ట్‌లో ముందుగా ఉండేది వేమూరి రాధాకృష్ణనే.
తెలుగుదేశం పార్టీ నేతలందరి కన్నా… ముందుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి టార్గెట్‌గా వేమూరి రాధాకృష్ణ ఉన్నారు. ఆయనను జైలుకు పంపాలని… జగన్‌కు మాత్రం ఉండదా..? . ఒక్క సారి వేమూరి రాధాకృష్ణ జైలుకు వెళ్తే.. జగన్‌కు …ఆర్కే చెప్పినప్రశాంతత లభిస్తుంది. అంత మాత్రాన ఆర్కేజైలుకు వెళ్తారా..? అయితే.. ఇలాంటి సామాహిక అరెస్టులు.. వ్యంగ్య కోణంలోనే ఆర్కే చేసి ఉంటారు. పాలకుడు కక్ష కట్టుకుని అరెస్ట్ చేస్తున్నారు కదా అని..తప్పు చేయకపోయినా అరెస్టయిపోవడానికి ఎవరు రెడీ అవుతారు..?. ఇదే ఆర్టికల్‌లో తిరుపతి దొంగ ఓట్ల పైనా ఆర్కే.. అసహనం వ్యక్తం చేశారు. పోలీసులు, ఈసీ , జగన్ వర్గానికి సపోర్ట్‌గా నిలిచే మీడియాపైనా మండిపడ్డారు. వ్యవస్థల్ని నిర్వీర్యం చేశారని పోలీసులు, ఈసీని నిందించారు. దొంగ ఓట్లను చూపించడానికి జగన్ వర్గం మీడియా సందేహించడాన్ని తప్పు పట్టారు.
తిరుపతిలో దొంగ ఓట్లు వేశారనేదానికి ప్రత్యక్ష ఆధారాలు ఉన్నా… అసలు దొంగ ఓట్లే లేవని వైసీపీ వాదిస్తోంది. ఆ వాదనకు.. పోలీసులు.. ఈసీతో పాటు జగన్ వర్గానికి మద్దతుగా నిలిచే మీడియా నిలబడుతోంది. ఇలాంటి పరిస్థితిని ఆర్కే ఊహించలేకపోయారు. అందుకే ఆయన వచ్చే ఎన్నికల్లోనూ ఏపీలో మూడు విడతలు ఎన్నికలు పెట్టి.. ఈ దొంగ ఓటర్లందర్నీ ఒక చోట నుంచి మరో చోటకు మార్చి..ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయిస్తారని.. బెంగాల్లో ఇంత కరోనా పరిస్థితుల్లోనే ఎనిమిది విడతల ఎన్నికలు పెడుతున్న కేంద్రానికి .. జగన్మోహన్ రెడ్డి కోసం.. మూడువిడుతలు పెట్టకుండా ఉంటుందా.. అని ఆయన ప్రశ్నించారు.