ఇటీవలి కాలంలో తెలంగాణ రాజకీయ తెరపైకి దూసుకువచ్చింది వైఎస్ షర్మిల. వచ్చిన మొదట్లో బిజెపి తెర వెనక ఉండి ఈవిడ ని నడిపిస్తోందా లేక కెసిఆరే తెర వెనక ఉండి నడిపిస్తున్నాడా అన్న చర్చ కొంతవరకు జరిగింది. అయితే రాజకీయాల్లోకి వచ్చి కొద్ది రోజులు కాక ముందే షర్మిల ప్రజలకు కామెడీ రిలీఫ్ ఇవ్వడం మొదలుపెట్టింది. ఆ మధ్య ఒక యువకుడు ” అక్కా, నువ్వున్నావన్న ధైర్యంతోనే బతుకుతున్నా అక్కా” అంటూ మాట్లాడటం సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అయింది. తాజాగా తన వల్లే కేసీఆర్ ఉచిత వ్యాక్సిన్ ఇచ్చేందుకు ఒప్పుకున్నాడు అంటూ షర్మిల చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. వివరాల్లోకి వెళితే..
షర్మిల నిన్న ట్వీట్ చేస్తూ, ” ప్రజల ప్రాణాల కంటే విలువైనది ఏదీ లేదు. కాంట్రాక్టర్లకు వేల కోట్ల రూపాయలు అప్పనంగా అప్పజెప్పగా లేనిది.. ప్రజలకు ఉచితంగా వాక్సిన్ ఇవ్వడానికి రూ.1000 కోట్లు ఖర్చు చేయలేరా కేసీఆర్ గారూ..? ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఫ్రీ వాక్సిన్ ఇవ్వండి సీఎం సారూ..” అని రాసుకొచ్చారు.
ప్రజల ప్రాణాలకంటే విలువైనది ఏదీ లేదు. కాంట్రాక్టర్లకు వేల కోట్ల రూపాయలు అప్పనంగా అప్పజెప్పగా లేనిది.. ప్రజలకు ఉచితంగా వాక్సిన్ ఇవ్వడానికి రూ.1000 కోట్లు ఖర్చు చేయలేరా కేసీఆర్ గారూ..? ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఫ్రీ వాక్సిన్ ఇవ్వండి సీఎం సారూ..
— YS Sharmila (@realyssharmila) April 24, 2021
అయితే తాజాగా కేసీఆర్ కూడా ఇదే నిర్ణయం తీసుకున్నారు. దీంతో తన డిమాండ్ వల్లే కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు అంటూ క్రెడిట్ తీసుకోడానికి ప్రయత్నిస్తున్నారు షర్మిల. ఆవిడ తాజా గా ట్వీట్ చేస్తూ, ” చావు భయంతో చస్తున్న ప్రజలను అప్పులపాలు చెయ్యడం అమానుషం.
ప్రజల మాట, మా మాట విని అందరికి వ్యాక్సిన్ ఉచితంగా ఇచ్చేందుకు ఒప్పుకున్నందుకు KCR గారికి ధన్యవాదాలు. ఇప్పుడైనా మేల్కొని కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చి చచ్చి బతికిన వారిని ఆదుకోవాలని సర్కారుకు మా విజ్ఞప్తి. ” అని రాసుకొచ్చారు.
చావు భయంతో చస్తున్న ప్రజలను అప్పులపాలు చెయ్యడం అమానుషం.
ప్రజల మాట, మా మాట విని అందరికి వ్యాక్సిన్ ఉచితంగా ఇచ్చేందుకు ఒప్పుకున్నందుకు KCR గారికి ధన్యవాదాలు. ఇప్పుడైనా మేల్కొని కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చి చచ్చి బతికిన వారిని ఆదుకోవాలని సర్కారుకు మా విజ్ఞప్తి. pic.twitter.com/e9vncuv4mK— YS Sharmila (@realyssharmila) April 25, 2021
అయితే నెటిజన్ల నుంచి షర్మిల ట్వీట్ కి మిశ్రమ స్పందన వస్తోంది. ఒకరిద్దరు షర్మిల వ్యాఖ్యల తో ఏకీభవిస్తే, చాలా మంది, ఈ వ్యాఖ్యల పట్ల నవ్వుకుంటున్నారు. షర్మిల చెబితేనే గానీ తెలుసుకోలేని స్థితిలో కేసీఆర్ లేడు అని చాలా మంది అభిప్రాయ పడితే, మరి కొందరు మాత్రం కేసీఆర్ తీసుకోబోతున్న నిర్ణయాన్ని ఎలాగో తెలుసుకుని కావాలనే ముందు రోజు షర్మిల ట్వీట్ చేసిందని, తద్వారా ఇప్పుడు క్రెడిట్ తీసుకోడానికి తనకు అవకాశం దొరికింది అని, ఆ రకం గా ఆవిడ తెలీవైనదే అని అభిప్రాయపడ్డారు. ఏది ఏమైనా షర్మిల తాజా ట్వీట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశం గా మారింది.