చెన్నై సూపర్ కింగ్స్ తురుపు ముక్క రవీంద్ర జడేజా మరోసారి రెచ్చిపోయాడు. ఆఖరి ఓవర్లో 5 సిక్సర్లు కొట్టి.. చెన్నై భారీ స్కోరుకి ప్రధాన కారణమయ్యాడు. అక్షర్ పటేల్ వేసిన ఇన్నింగ్స్ 20 వ ఓవర్లో ఏకంగా 5 సిక్సులు కొట్టి 37 పరుగులు పిండుకున్నాడు. ఈరోజు బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ కి దిగిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లకు 191 పరుగులు చేసింది. ఓ దశలో 170 పరుగులు సాధించడమే గగనం అనుకున్న దశలో.. ఆఖరి ఓవర్లో జడేజా రెచ్చిపోయాడు. తొలి బంతికి సిక్స్ కొట్టాడు. రెండో బంతి నో బాల్ ని సిక్స్ కి తరలించాడు. ఫ్రీ హిట్ కీ అదే శిక్ష పడింది. మూడు, నాలుగో బంతి కూడా బౌండరీ లైన్అవతల పడింది. తరువాతి బంతికి 2 పరుగులు, చివరి బంతికి 4 పరుగులు లభించాయి. చివరి బంతి కూడా సిక్స్వెళ్తేదే. బౌండరీ లైన్ కి కాస్త ఇవతల పడింది. మొత్తానికి 28 బంతుల్లో 62 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు జడేజా.