దేశంలో వైరస్ వ్యాప్తిగా జరుగుతున్న విపరీత ప్రచారం కారణంగా మానసిక ఒత్తిడికి గురై.. .ఊపిరి ఆడటం లేదని ఆందోళనకు గురై.. ప్రాణాలు విడుస్తున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. కరోనా సోకకపోయినా సోకిందని… బాధపడుతున్నారు. ఆక్సిజన్ లెవల్స్ బాగున్నా తమకు ఏదో అయిపోతోందని కంగారు పడేవారు ఎక్కువగా ఉన్నారు. మీడియాలో జరుగుతున్న ప్రచారం.. ప్రపంచాన్ని కబళిస్తోందన్న భయాలు… ప్రజల మనసులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఆ వైరస్ విషయంలో ఉన్న అపోహలు… ప్రజల మధ్య.. కుటుంబాల మధ్య చిచ్చు పెడుతున్నాయి. గ్రామాల్లోనూ.. గొడవలకు కారణం అవుతున్నాయి.
వైరస్ వ్యాప్తి పరిస్థితులతో పాటు.. ఇలా.. ప్రజల మానసిక ఆరోగ్యాన్ని కూడా కరోనా దెబ్బ తీస్తోంది. శారీరంగా వచ్చిన వైరస్ను… ఏదో విధంగా నయం చేయవచ్చు కానీ.. మానసికంగా .. ఇలా వైరస్ జనం మనసుల్లోకి చొచ్చుకెళ్లిపోతే మాత్రం.. ఆ దుష్ఫలితాలు అనూహ్యంగా ఉంటాయి. ఇలాంటి విషయాల్లో ప్రభుత్వాలు వినూత్నంగా వ్యవహరించాల్సి ఉంది. కరోనాపై ఉన్న అపోహలు..భయాలను తొలగించాల్సి ఉంటుంది. లేక ముందు ముందు మరిన్ని.. ఇబ్బందికర పరిస్థితుల్ని కరోనా తీసుకొచ్చి పెడుతుంది. ప్రాణాలు పోయిన చాలా మందికి ప్రాణాలు పోయేంత సీరియస్గా పరిస్థితి లేదని.. కేవలం భయాందోళనలకు గురవడం వల్లనే ప్రాణాలు కోల్పోతున్నారని వైద్య వర్గాలు చెబుతున్నాయి. కరోనా వస్తే చనిపోతారన్న అభిప్రాయం ఏర్పడటం.. ప్రభుత్వం కూడా అలాగే ట్రీట్చేస్తూండటంతో.. సమస్య తీవ్ర రూపం దాలుస్తోంది. భయంతో.. నిజంగానే తమకు ఊపిరి ఆడటం లేదనే భావనకు రోగులు వెళ్లిపోతున్నారు. చివరికి అలాగే ప్రాణాలు కోల్పోతున్నారు.
ప్రస్తుతం ఇప్పుడు తక్షణం… కరోనా బారిన పడిన వారికి.. వైద్య సాయం అందించడంతో పాటు.. మానసికంగా వారిని ధైర్యంగా ఉంచేలా చేయడంలో కీలకంగా వ్యవహరించాల్సి ఉంది. మానసిక నిపుణులతో.. తక్షణం చికిత్స ప్రారంభించాల్సి ఉంది. కరోనాపై ప్రజల్లో నెలకొన్న భయాలను… ఎప్పటికప్పుడు తీర్చే విధంగా.. సన్నాహాలు చేయాలి. లేకపోతే.. లేని పోని భయాలతోనే.. ప్రజలు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికే ఆ పరిస్థితి వచ్చేసింది. మనో ధైర్యమే మొదటి ఆక్సిజన్ అని.. ప్రజలకు విడమర్చి చెప్పాల్సి ఉంది. లేకపోతే పరిస్థితి దిగజారిపోతుంది.