ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ భార్య కనకదుర్గ కన్నుమూశారు. ఆమె వయసు 63 ఏళ్లు. ఆంధ్రజ్యోతి ఓ సంస్థగా ఆర్థికంగా బలంగా ఎదగడంతో ఆమె కీలక పాత్ర పోషించారు. మోహన్‌బాబుతో జరిగిన రివర్స్ ఓపెన్ హార్ట్ కార్యక్రమంలో వేమూరి రాధాకృష్ణ… తన జీవిత భాగస్వామి గురించి వివరించారు. అలాగే పలు సందర్భాల్లో తన సతీమణి గురించి గొప్పగా రాధాకృష్ణ చెప్పేవారు. మొదట్లో ఓ బ్యాంక్ ఎంప్లాయి అయిన ఆమె… వేమూరి రాధాకృష్ణ.. ఆంధ్రజ్యోతిని కొనుగోలు చేసిన తర్వాత… కొంత కాలానికి .. సంస్థలో చేరారు. ఆర్థిక వ్యవహారాలను మొత్తం చక్కబెట్టారు. చనిపోయే వరకూ ఆంధ్రజ్యోతి ఫైనాన్స్ డైరక్టర్‌గా ఆమె ఉన్నారు.
ఆంధ్రజ్యోతిలో ప్రతి ఒక్క రూపాయి ఖర్చు ఆమె కనుసన్నలలోనే జరుగుతుందని.. అనవసర వ్యయం చేయకుండా.. కట్టడి చేసి.. సంస్థను ఆర్థికంగా ఇబ్బందుల్లోకి వెళ్లకుండా చూసేవారని అంటారు. కనకదుర్గకు కొంత కాలంగా అనారోగ్య సమస్యలు ఉన్నాయని చెబుతున్నారు. ఈ కారణంగా ఆమె కొన్ని రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో చనిపోయినట్లుగా తెలుస్తోంది. ఆంధ్రజ్యోతిని కుమారుడు, ఏబీఎన్ చానల్‌ను అల్లుడు ప్రస్తుతం నిర్వహిస్తున్నారు. వేమూరి కనకదుర్గ మృతిపై పలువురు ప్రముఖులు రాధాకృష్ణకు సంతాపం తెలుపుతున్నారు.
ఇప్పుడు ఎవరు చనిపోయినా కరోనా కారణమా అన్న అనుమానం చాలా మందిలో పట్టి పీడిస్తోంది.్యితే.. వేమూరి కనకదుర్గ మృతికి కరోనా కారణం కాదని తెలుస్తోంది. ఆమెకు దీర్ఘ కాలికంగా ఉన్న ఆరోగ్య సమస్యలు విషమించడంతోనే చనిపోయినట్లుగా చెబుతున్నారు.