ఏ హీరోకూ తీసిపోని ఇమేజ్ నయనతార సొంతం. తను లేడీ సూపర్ స్టార్. తన లైఫ్ స్టైల్ కూడా అలానే ఉంటుంది. ఈమధ్య నయన నేలపై కంటే విమానాలలోనే ఎక్కువగా తిరుగుతోంది. హైదరాబాద్ లో జరుగుతున్న ఓ సినిమా షూటింగ్ కోసం.. నయన ప్రత్యేకమైన విమానంలో వచ్చింది. స్టార్లు.. చార్టెర్ట్ ఫ్లైట్స్ లో తిరగడం మామూలు విషయమే. కానీ.. అదంతా హీరోల వరకే పరిమితం. ఓ కథానాయిక ఇలా షూటింగులకు వ్యక్తిగతమైన విమానాల్లో రావడం.. సౌత్ లో నయనతారతోనే మొదలేమో. ఆమధ్య… ప్రియుడు విఘ్నేష్ శివన్‌తో కలిసి.. హాలీడే ట్రిప్ కి వెళ్లింది నయన. అప్పుడు కూడా ప్రత్యేకమైన విమానంలోనే ప్రయాణం చేసింది. కరోనా భయాలు ఓ వైపు. ప్రైవసీ మరో వైపు. అందుకే… నయన ఇలా విమానాల్ని నమ్ముకుంది. నయన జోరు చూస్తేంటే… త్వరలోనే తన కోసం ఓ విమానం కొనేసినా కొనేయగలదు. దక్షిణాదిన అత్యధిక పారితోషికం తీసుకుంటున్న కథానాయికగా.. నయనకు ఆ రేంజు ఉంది లెండి. కాకపోతే నయన స్పీడు చూసి తమిళనాట అగ్ర హీరోలు కుళ్లుకుంటున్నార్ట. ఇప్పటి నుంచి.. తమిళ హీరోలంతా సెట్స్ లోకి విమానాలతో లాండ్ అవ్వాల్సిందే. లేదంటే… ఇజ్జత్ పోదూ..?!