రజనీకాంత్ సినిమాలో ఓ సీన్ ఉంటుంది.. పెళ్లి కొడుకు వీడే.. కానీ వాడు వేసుకున్నషర్ట్ మాత్రం వాడిది కాదని…! ఎవరూ అడగకపోయినా ఆ షర్టు గురించి చెప్పి పెళ్లి సంబంధాన్నే చెడగొట్టేసుకుంటారు. ఇప్పుడు రిజైన్ మోడీ అనే హ్యాష్ ట్యాగ్ వ్యవహారంలో ఫేస్ బుక్ తీరు అంతే ఉంది. రెండు, మూడు రోజులుగా… రిజైన్ మోడీ హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్‌లో ఉంది. కనీసం పదిహేను కోట్ల మంది ఆ హ్యాష్ ట్యాగ్‌తో పోస్టులు చేశారు. అయితే హఠాత్తుగా ఆ హ్యాష్ ట్యాగ్ కనిపించకుండా పోయింది. దీంతో అంతా.. బీజేపీ.. మోడీ సర్కార్ పనేనని అనుకున్నారు. కానీ హఠాత్తుగా ఫేస్బుక్ ఓ ప్రకటన విడుదల చేసింది. రిజైన్ మోడీ హ్యాష్ ట్యాగ్‌ను తొలగించాలని మోడీ సర్కార్ చెప్పలేదని ఆ ప్రకటన సారాంశం.
అంతర్జాతీయంగా కొన్ని పత్రికలు కూడా.. ఫేస్బుక్ భారత సర్కార్ ఒత్తిళ్లకు తలొగ్గి ఆ హ్యాష్ ట్యాగ్ తొలగించిందని ప్రకటించాయి. దీంతో.. ఆ వ్యవహారం చర్చనీయాంశం అయింది. ఆ తర్వాతే ఫేస్ బుక్ ప్రకటన వచ్చింది. ఫేస్బుక్ ఖండన ప్రకటన వచ్చిన తర్వాత భారత ప్రభుత్వం.. అలాంటి కథనాలు రాసిన ఇంటర్నేషనల్ మీడియాపై మండిపడింది. చివరికి ఫేస్బుక్ కూడా వెనక్కి తగ్గడంతో… ఆ మీడియా.. కూడా.. ఆ కథనాలను ఉపసంహరించుకుంది. అయితే.. భారత ప్రభుత్వం..మీడియా.. సోషల్ మీడియాతో వ్యవహరించే విధానం చూసిన వారికి ఫేస్ బుక్ ఉత్తినే… రిజైన్‌మోడీ హ్యాష్ ట్యాగ్ తొలగించదని అర్థమైపోయింది.
ఫేస్‌బుక్‌పై కొంత కాలంగా.. బీజేపీకి మద్దతుగా ఉంటుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆ పార్టీకి చెందిన వారి ప్రచారం మాత్రమే ఓ రేంజ్లో చేసి.. ద్వేష రాజకీయాలను కూడా పెంచి పోషించిందనే ఆరోపణలు ఉన్నాయి. ఫేస్బుక్ ఉన్నతాధికారి ఒకరు ఈ వివాదంలో రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆమె తర్వాత బీజేపీలో చేరింది. ఫేస్బుక్ జియోలో కూడా భారీగా పెట్టుబడులు పెట్టి అందరి దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు.. రిజైన్ మోడీ హ్యాష్ ట్యాగ్ విషయంలో.. తమకు ఎవరూ చెప్పకుండానే తీసేశామని చెప్పుకుంటోంది.