లాక్డౌన్ పేరుతో దేశ ప్రజలతో కొంత మంది ఎమోషనల్ గేమ్ ఆడుతున్నారు. కేంద్రం అధికారికంగా… దేశవ్యాప్తంగా లాక్ డౌన్ పెట్టే అవకాశం లేదని.. రాష్ట్రాల వారీగా నిర్ణయాలు తీసుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. అయితే కొంత మంది సోషల్ మీడియా స్వేచ్చను లాక్ డౌన్ పేరుతో ఫేక్ న్యూస్ ప్రసారం చేయడానికి ఉపయోగించుకుంటున్నారు. దీంతో ప్రజల్లో గందరగోళం ఏర్పడుతోంది. మే రెండో తేదీన అంటే.. ఆదివారం ఐదురాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్ పూర్తవుతుంది. ఆ తర్వాత రోజే.. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అంటూ కొద్ది రోజుల నుంచి ప్రచారం చేస్తున్నారు. మెజార్టీ జనం నమ్ముతున్నారు.
దీంతో వారు.. రెండు, మూడు నెలలకు సరిపడా నిత్యావసర వస్తువులు తెచ్చుకుని ఇంట్లో భద్రపర్చుకుంటున్నారు. అసలు పానడమిక్ కన్నా ఇదే ఎక్కువగా ప్రచారం జరుగుతోంది. దీంతో కేంద్ర ప్రభుత్వ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ప్రత్యేకంగా వివరణ ఇచ్చింది. లాక్ డౌన్‌పై కేంద్రం ఎలాంటి ప్రకటనలు చేయలేదని స్పష్టం చేసింది. అయితే.. అసలు కళ్లతో చూసిన నిజాన్ని కూడా నమ్మలేని రీతిలో.. సోషల్ మీడియాలో వచ్చిన వార్తలే నిజం అనుకునేలా.. ప్రస్తుతం ప్రజల మైండ్ సెంట్ మారిపోయింది. అందుకే ఎక్కువ మంది లాక్ డౌన్ ఉంటుందనే నమ్ముతున్నారు.
మరో వైపు… అమెరికా అంటు వ్యాధుల నిపుణుడు ఆంటోనియో ఫౌచీ.. భారరత్లో కరోనా కంట్రోల్లోకి రావాలంటే.. లాక్ డౌన్ ఒక్కటే మార్గమని మీడియా ద్వారా సందేశం పంపించారు. ఇది కూడా మీడియాలో వైరల్ అవుతోంది. మొత్తంగా ఆదివారం కౌంట్ డౌన్ అయిపోతుంది. ఆ తర్వాత.. కేంద్రం ఏదైనా నిర్ణయాన్ని ప్రకటిస్తుందా.. లేకపోతే.. రాష్ట్రాలకే్ వదిలేస్తుందా అన్నదానిపై క్లారిటీ వస్తుంది. అప్పటి వరకూ ప్రచారం ఆగదు.