యాంకర్ ప్రదీప్ మాచిరాజు ఇంట్లో విషాదం నెలకొంది. ప్రదీప్ తండ్రి పాండు రంగ కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధ పడుతున్నారు. కొద్ది సేపటి క్రితం ఆయన కన్నుమూశారు. ప్రదీప్ కి కరోనా సోకిందని ఈమధ్య వార్తలొచ్చాయి. పాండు రంగ కూడా కరోనాతో బాధ పడ్డారని తెలిసింది. మరి ఆయన.. కరోనాతో కన్నుమూశారా? లేదంటే మరో కారణముందా? అనేది తెలియాల్సివుంది.
బుల్లి తెరపై తిరుగులేని స్టార్… ప్రదీప్. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా? సినిమాతో హీరోగానూ ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా నిర్మాతలకు లాభాల్ని తెచ్చిపెట్టింది. ఆ తరవాత హీరోగా పలు అవకాశాలు వచ్చినా.. ప్రదీప్ అంగీకరించలేదు. త్వరలోనే ఓ కొత్త ప్రాజెక్టుని పట్టాలెక్కించే పనిలో ఉన్నారాయన. ఇంతలోనే.. తన ఇంట్లో విషాదం చోటు చేసుకుంది.