ప్రస్తుతం భారతదేశంలో ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న తీరు ఆందోళన కలిగిస్తుంది. అనేక మంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరంగా ఉంది. ఈ విపత్కర పరిస్థితుల్లో తెలుగు వారికి సహాయంగా టీమ్ నిరంజన్ మరియు ఫ్రెండ్స్ తరుపున ” లక్ష డాలర్లు” విరాళంగా ప్రకటించారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేస్తూ శ్రీ నిరంజన్ శృంగవరపు ఈ విషయాన్ని తెలియజేశారు.
ఆయన మాట్లాడుతూ.. “ఈ మొత్తాన్ని అతి త్వరలో తానా ఫౌండేషన్ కి అందజేస్తాం. తెలుగువారి సేవ కోసం వినియోగిస్తాం. దీనితో పాటు తెలుగు కమ్యూనిటీ లో ఉన్న పెద్దలు ముందుకు వచ్చి తమ వంతు సహాయాన్ని అందించాలని మేము కోరుకుంటున్నాం. కోవిడ్ ఫస్ట్ వేవ్ సందర్భంగా ” లక్ష డాలర్లు” వ్యక్తిగతంగా రైజ్ చేసి ఇచ్చాము. అదే కాకుండా మూడు కోట్ల రూపాయలకు పైగా విరాళాలు సేకరించి తానా ఫౌండేషన్ ద్వారా పదిహేను స్వచ్ఛంద సంస్థల సమన్వయంతో ఒక లక్ష కుటుంబాలకు నిత్యావసర సరుకుల కిట్లు అందజేయడం జరిగింది. మూడు లక్షల మందికి అన్నదానం అందజేయడం జరిగింది. ఆరు లక్షల మాస్కులు అందించాం. తెలుగువారి సేవ కోసం టీం నిరంజన్ ఎప్పుడూ ముందు ఉంటుంది. వారికి ఎటువంటి ఆపద ఎదురైనా సహాయం చేయడానికి, ఆదుకోవటానికి నడుంబిగించి కదులు తుంది.” అని అన్నారు.