వెంకటేష్ కి రీమేక్ సినిమాలంటే ఎంత మక్కువో..? ఆయన హిట్ సినిమాల్లో సగం రీమేక్‌లే. ఇప్పుడు మూడు సినిమాలు సెట్స్ లో ఉంటే.. (దృశ్యమ్ 2, నారప్ప, ఎఫ్ 3) అందులో రెండు రీమేక్‌లు. ఇప్పుడు మరో రీమేక్ పై వెంకీ దృష్టి పడింది. అదే.. డ్రైవింగ్ లైసెన్స్. రెండేళ్ల క్రితం మలయాళంలో విడుదలైన సినిమా ఇది. పెద్ద హిట్. 5 కోట్లతో సినిమా తీస్తే ఏకంగా 40 కోట్లు రాబట్టింది. డ్రైవింగ్ లైసెన్స్‌ని తెలుగులో తీస్తే బాగుంటుందని చాలా రోజుల నుంచీ.. భావిస్తున్నారు. ఆ సినిమా వెంకటేష్ చేస్తే ఇంకా బాగుంటుందన్నది సినీ వర్గాల ఉవాచ. అదే జరుగుతోంది. ఈసినిమా రైట్స్ ని సురేష్ ప్రొడక్షన్స్ చేజిక్కించుకుందని సమాచారం. వెంకటేష్ నటించబోతున్నారని తెలుస్తోంది. అయితే ఇది మల్టీస్టారర్. వెంకీతో పాటుగా మరో హీరో కావాలి. ఆ హీరో ఎవర్నది తేలాల్సివుంది. ప్రస్తుతానికైతే డ్రైవింగ్ లైసెన్స్ ని తెలుగు ప్రేక్షకులకు, ముఖ్యంగా వెంకీ శైలికి నచ్చేలా మార్పులు చేర్పులూ చేస్తున్నారు. అవన్నీ ఓ కొలిక్కి వచ్చాకే.. రెండో హీరో ఎవరన్నది తెలుస్తుంది.