అనుకున్నదే అయ్యింది. ఐపీఎల్ నిరవధికంగా వాయిదా పడింది. కొలకొత్తాకు చెందిన ఇద్దరు ఆటగాళ్లు కరోనా బారీన పడడంతో… సోమవారం జరగాల్సిన మ్యాచ్ వాయిదా వేశారు. ఈరోజు మరికొంతమంది ఆటగాళ్లకు వైరస్ సోకిందన్న విషయం బయటపడడంతో… టోర్నీని నిరవధికంగా వాయిదా వేశారు. ఈ విషయాన్ని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ధ్రువీకరించారు. ఈ రోజు హైదరాబాద్, ముంబై జట్ల మధ్య మ్యాచ్ జరగాల్సివుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు వృద్ధిమాన్ సాహాకి కరోనా పాజిటీవ్ అని తేలింది. ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న అమిత్ మిశ్రాకు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. మిగిలిన ఆటగాళ్లకూ క్వారెంటైన్ కి పంపాల్సిరావడం, ఆటగాళ్లలో కరోనా భయాలు ఎక్కువ అవ్వడంతో, వారి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదు. అయితే.. ఈ టోర్నీ వేదికను దుబాయ్ కి మరల్చే అవకాశం ఉంది. జూన్ – .జులైలలో.. ఐపీఎల్ ని దుబాయ్ లో కొనసాగించేందుకు బీసీసీఐ కసరత్తు చేస్తోందిని తెలుస్తోంది. దుబాయ్‌కి మరల్చాలన్న ప్రతిపాదన ఓకే చేశాకే… ఐపీఎల్ ని నిరవధికంగా వాయిదా వేసినట్టు నిర్ణయించుకున్నారని టాక్.