దర్శకులకు సెంటిమెంట్లు ఉంటాయి. హిట్ ఫార్ములాను వాళ్లు రిపీట్ చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. వీలైనంత వరకూ.. హిట్ కాంబినేషన్లని వదిలిపెట్టరు. గోపీచంద్ మలినేనికీ.. ఓ సెంటిమెంట్ ఏర్పడింది. శ్రుతి హాసన్ రూపంలో. బలుపు సినిమాతో గోపీచంద్ మలినేని దర్శకుడిగా అవతారం ఎత్తాడు. ఆసినిమా హిట్టు. ఆ సినిమాలోనే శ్రుతిహాసన్ కథానాయిక. మొన్నటికి మొన్న `క్రాక్` కోసం కూడా…. శ్రుతిని ఏరి కోరి ఎంచుకున్నాడు. ఆసినిమా కూడా హిట్టే. ఇప్పుడు నందమూరి బాలకృష్ణతో ఓ సినిమా చేయబోతున్నాడు గోపీచంద్. అందుకు తగిన కథ రెడీ అవుతోంది.
ఈ సినిమాలో బాలయ్య ద్విపాత్రాభినయం చేయబోతున్నాడని టాక్. పోలీస్‌గా, ఫ్యాక్షనిస్టుగా బాలయ్య కనిపించబోతున్నాడట. రెండు పాత్రలు కాబట్టి.. మినిమం ఇద్దరు హీరోయిన్లు ఉండాల్సిందే. ఇప్పటికే ఓ హీరోయిన్ గా శ్రుతిని ఎంపిక చేసేశాడని తెలుస్తోంది. బాలయ్య – శ్రుతిహాసన్ కాంబినేషన్ కొత్తగానే ఉంటుంది కాబట్టి, బాలయ్య వైపు నుంచి కూడా అభ్యంతరాలు లేకపోవొచ్చు. మరి రెండో కథానాయిక ఎవరన్నది తేలాల్సివుంది. ఇటీవల `వకీల్ సాబ్`లో పవన్ కల్యాణ్ పక్కన నటించింది శ్రుతి. అందులో మరీ పీలగా కనిపించింది. ఆసినిమా హిట్టయినా.. శ్రుతికి ఎలాంటి క్రెడిట్ దక్కలేదు. పైగా.. మైనస్ అనే ముద్ర వేసుకొచ్చింది. ఇప్పుడు బాలయ్య సినిమా కోసమైనా తన అవతారం మార్చుకుంటుందేమో చూడాలి.