ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్న సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ కరోనా లాక్ డౌన్ దెబ్బకు ఆగిపోయే పరిస్థితి వచ్చింది. అయితే… సెంట్రల్ విస్టాలోని కీలకమైన భాగంఅయిన ప్రధానమంత్రి నివాసాన్ని టార్గెట్ టైమ్లోపు పూర్తి చేయాలని కేంద్రం కాంట్రాక్టర్ను ఆదేశించింది. ఇందు కోసం.. ఆ నిర్మాణాన్ని అత్యవసర సర్వీసుల కేటగిరిలోకి చేర్చింది. ఆ అంశంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణలోనూ అలాంటిపరిస్థితే కనిపిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ… కొత్త సెక్రటేరియట్ నిర్మాణం ఆగకూడదని… ప్రభుత్వ పెద్దలు.. అధికారులు.. కాంట్రాక్టర్లకు తేల్చి చెప్పేశారు. దాంతో కరోనా టైంలోనూ… నిర్మాణం జోరుగా సాగుతోంది.
కొత్త సెక్రటేరియట్… తెలంగాణ సీఎం స్వప్నం లాంటిది. ఆయన చాలా కాలంగా దీన్ని కట్టాలని అనుకుంటున్నారు. అన్ని అడ్డంకులు అధిగమించి.. సచివాలయ భవన సముదాయ నిర్మాణ పనులను 2019 జూన్ 26న ప్రారంభించారు. తెలంగాణ ఖ్యాతిని చాటేలా సచివాలయ భవనం ఉండాలని చెప్పారు సీఎం కేసీఆర్. పనులను నిరాటంకంగా కొనసాగించి, 12 నెలల నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. కానీ అప్పుడే దాదాపు 20 నెలలు గడిచిపోయింది. ఇంకా పనులు మాత్రం ప్రారంభ దశలోనే ఉన్నాయి. ఇటీవల కేసీఆర్ ప్రత్యేకంగా సైట్కు వెళ్లి పరిశీలన జరిపి… వేగంగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.
ప్రస్తుతం కరోనా సెకండ్ వెవ్ ఎక్కువగా ఉండడంతో… లాక్ డౌన్ ఉంటుందని ప్రచారం జరగడం… కూలీలు సొంతూళ్ల బాటపట్టారు. చాలా మంది కూలీలు వివిధ రాష్ట్రాలకు చెందిన వారు కావడంతో … వారు వారి సొంత గ్రామాలకు వెళ్తున్నా రు. ఫలితంగా సచివాలయం నిర్మాణ పనులు ప్రస్తుతం మందకొడిగా సాగుతున్నాయి. తెలంగాణలో లాక్ డౌన్ ఉండదని పదే పదే చెబుతూండటంతో.. కొంతమందిని ఆపుతున్నారు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా సెక్రటేరియట్ పూర్తి చేయాల్న లక్ష్యంతో కేసీఆర్ ఉన్నారు. రాజకీయపరంగా.. కీలక పరిణామాలు.. ఆ సెక్రటేరియట్ నిర్మాణం పూర్తవడంతోనే ఉంటాయని కూడా చెబుతున్నారు. విపక్షాలు.. ఈ సమయంలో అవసరమాఅని విమర్శలు చేస్తున్నా.. అటుకేంద్రం… కానీ ఇటు తెలంగాణ సర్కార్ కానీ పట్టించుకునే పరిస్థితి లేదు.