కరోనా మరో పాత్రికేయుడ్ని బలి తీసుకుంది. ప్రముఖ జర్నలిస్టు టీఎన్నార్.. కరోనాతో పోరాడుతూ కొద్ది సేపటి క్రితం తుదిశ్వాస విడిచారు. టీఎన్నార్ టాక్ షో పేరుతో.. ఆయన సినీ ప్రముఖులతో నిర్వహించిన ఇంటర్వ్యూలు బాగా పాపులర్ అయ్యాయి. అవే.. ఆయనకు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. ఆ తరవాత కొన్ని సినిమాల్లోనూ నటించారు. కొద్ది రోజుల క్రితం.. ఆయనకు కరోనా సోకింది. ఇంట్లోనే ఉంటూ, చికిత్స తీసుకున్నారు. అయితే పరిస్థితి విషమించడంతో, ఆయన్ని హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. అయితే రెండ్రోజుల నుంచీ ఆయన శరీరం చికిత్సకు స్పందించడం లేదు. చివరికి.. కొద్ది సేపటి క్రితం కన్నుమూశారు.