తెలుగులో మరో అగ్రహీరో కరోనా బారిన పడ్డారు. జూనియర్ ఎన్టీఆర్ తనకు.. పాజిటివ్ వచ్చినట్లుగా ప్రకటించారు. తన ట్విట్టర్ అకౌంట్‌లో ఈ విషయం ప్రకటించిన ఎన్టీఆర్.. స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని.. హోమ్ ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నాని… ఎవరూ కంగారు పడాల్సిన పని లేదని ప్రకటించారు. తనతో కాంటాక్ట్ అయిన వారందరూ.. కోవిడ్ ప్రోటోకాల్ ప్రకారం టెస్టులు చేయించుకోవాలని పిలుపునిచ్చారు.
జూనియర్ ఎన్టీఆర్ గత వారమే.. కరోనాకు సంబంధించి అందరూ జాగ్రత్తలు తీసుకోవాలని ట్రిపుల్ ఆర్ టీంతో కలిసి ఓ వీడియో సందేశాన్ని కూడా ఇచ్చారు. ఈలోపే ఆయనకు కోవిడ్ సోకింది. ఇప్పటికే పవన్ కల్యాణ్ పాజిటివ్‌గా తేలి చికిత్స పొంది.. ఆరోగ్య వంతులయ్యారు. సినీ ఇండస్ట్రీ జాగ్రత్తలు తీసుకుంటోందని.. అత్యవసరమైన షూటింగ్‌లు మాత్రమే చేస్తున్నారని అనుకున్నారు.
అయితే.. పరిస్థితి తీవ్రంగా ఉండటం.. వైరస్ వ్యాప్తి ఊహించని స్థాయిలో ఉండటంతో… జూనియర్ ఎన్టీఆర్ కూడా కరోనా బారిన పడ్డారు. ట్రిపుల్ ఆర్ టీంలో ఇప్పటికే రాంచరణ్ కూడా కరోనా పాజిటివ్‌కు గురయ్యారు. తర్వాత కోరుకున్నారు. ఇప్పుడు ఎన్టీఆర్‌కూ పాజిటివ్ వచ్చింది. జూనియర్ త్వరగా కోలుకోవాలని అందరూ ట్వీట్లు చేస్తున్నారు.