సుధీర్ బాబు కొత్త సినిమా `శ్రీదేవి సోడా సెంటర్`. పలాసతో విమర్శకుల్ని మెప్పించిన కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈరోజు సుధీర్ బాబు పుట్టిన రోజు. ఈ సందర్భంగా చిన్నసైజు టీజర్ ఒకటి విడుదల చేశారు. అందులో సుధీర్.. సిక్స్ ప్యాక్‌తో మ్యాజిక్ చేశాడు. పదుల సంఖ్యలో నాటుపడవలు.. నదిలో జోరుగా సాగిపోతున్న ఏరియల్ షాట్ నుంచి టీజర్ మొదలైంది. విజువల్‌గా సినిమా మంచి స్థాయిలో ఉందని చెప్పడానికి ఆ షాటే నిదర్శనం. ఆ తరవాత.. వివిధ వేరియేషన్స్ లో.. సూరిబాబు (సుధీర్‌బాబు)ని చూపించారు. టీజర్లో డైలాగులేం లేకపోయినా, అంత ఇంపాక్ట్ యాక్షన్ పార్ట్ లో చూపించేశారు. ఇదో రొమాంటిక్ కామెడీ యాక్షన్ డ్రామా… అనే హింట్, టీజర్ తో ఇచ్చారు. పలాస ఓ ప్రయోగాత్మక చిత్రం అనుకుంటే, శ్రీదేవి సోడా సెంటర్ లో మాత్రం కమర్షియల్ అంశాల్ని మెండుగా పొందుపరిచినట్టు అనిపించింది. మరి ఆ మేళవింపు ఎలా సాగిందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి.