ఉప్పెనతో ఒక్కసారిగా బిజీ స్టార్ అయిపోయింది కృతి శెట్టి. రెండో సినిమాకే అరకోటి పారితోషికం అందుకునే రేంజ్ తెచ్చుకుంది. ఇప్పుడు ఈ అమ్ముడు ఫుల్ బిజీ. కాల్షీట్లు సర్దుబాటు చేయలేక కొన్ని సినిమాలూ వదులుకుంటోంది. తాజాగా తేజకు సైతం `నో` చెప్పింది.
దగ్గుబాటి అభిరామ్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న చిత్రానికి తేజ దర్శకుడు. ఇప్పటికే స్క్రిప్టు ఓకే అయిపోయింది. కథానాయికగా కృతి అయితే బాగుంటుందనుకున్నారు. కానీ కృతి మాత్రం `నో` చెప్పింది. ఇప్పటి వరకూ అందుకున్న పారితోషికం కంటే… బెటర్ ప్యాకేజీ ఇవ్వడానికి చిత్రబృందం రెడీ అన్నా సరే. కృతి ఒప్పుకోలేదట. దాంతో.. మరో ఆప్షన్ కోసం అన్వేషణలో పడ్డాడు తేజ. నిజానికి ఎప్పుడూ కొత్తవాళ్లలో ప్రయోగాలు చేయడం తేజకు అలవాటు. కృతి అయితే.. కాస్త మైలేజీ పెరుగుతుందని భావించి… ఆమె పేరు పరిశీలించారు. కానీ తను నో అనేసరికి… మళ్లీ ఎప్పటిలా కొత్తవాళ్ల వైపు దృష్టిసారించాడట. ప్రస్తుతం కథానాయిక కోసం సైలెంట్ గా ఆడిషన్స్ కూడా నిర్వహిస్తున్నట్టు టాక్.