హైకోర్టులో రఘురామకృష్ణరాజుకు షాక్ తగిలిగింది. తన అరెస్ట్ అక్రమం అంటూ ఆయన తరపు న్యాయవాదులు దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు.. పిటిషన్ను డిస్మిస్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. బెయిల్ కోసం.. సీఐడీ కోర్టుకే వెళ్లాలని సూచించింది. రఘురామకృష్ణరాజు దాఖలు చేసుకునే బెయిల్ పిటిషన్పై వెంటనే నిర్ణయం తీసుకోవాలని.. కింది కోర్టుకు హైకోర్టు సూచించింది. అదే సమయంలో.. రఘురామకృష్ణరాజుకు మూడు నెలల కిందటే బైపాస్ సర్జరీ జరిగిందని.. పిటిషనర్ తరపు న్యాయవాదులు విన్నవించడంతో.. ఆయన ఆరోగ్యానికి సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని హైకోర్టు న్యాయమూర్తి సూచించారు. దీంతో రఘురామకృష్ణరాజు.. కొన్ని రోజుల పాటు జైల్లో ఉండటం ఖాయంగా కనిపిస్తోంది.
అంతకు ముందు రఘురామకృష్ణరాజుపై పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. ఎఫ్ఐఆర్లో రఘురామకృష్ణరాజు ప్రతీ రోజూ మీడియాతో మాట్లాడటాన్ని ప్రసారం చేసిన ఏబీఎన్, టీవీ 5 చానళ్లను కూడా కుట్రదారులుగా సీఐడీ అధికారులు పేర్కొన్నారు. వ్యూహాత్మకంగా ప్రభుత్వంపై అసంతృప్తి పెంచేలా.. రఘురామకృష్ణరాజు మాట్లాడుతూంటే… ఈ రెండు చానళ్లు ప్రసారం చేస్తున్నాయని అది కుట్ర అని సీఐడీ అధికారులు చెబుతున్నారు. ఆ చానళ్లు స్లాట్స్ కేటాయించారని … కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టేలా మాట్లాడుతున్నారని వారు కుట్రలో భాగస్వాములని సీఐడీ చెబుతోంది. కులం, మతం ప్రాతిపదికన విభజన తెచ్చేందుకు ప్రయత్నించారని సీఐడీ ఎఫ్ఐఆర్లో పేర్కొంది.
సీఐడీ ఎఫ్ఐఆర్ మొత్తం చూస్తే.. రఘురామకృష్ణరాజు ప్రతీ రోజూ రచ్చ బండ పేరుతో మాట్లాడేవాటిని ప్రసారం చేయడమే అసలు కేసుకు మూలం అన్నట్లుగా ఉంది. ప్రతీ రోజూ ఆయన ప్రభుత్వాన్ని అనేక అంశాలపై విమర్శిస్తూ ఉంటారు. అయితే… సీఐడీ…ఎఫ్ఐఆర్ దాఖలు చేయడానికి ఎవరూ ఫిర్యాదులు చేయలేదు. సుమోటోగా తీసుకుని దర్యాప్తు చేసి.. ప్రాథమిక ఆధారాలుఉన్నాయని నిర్ధారించుకుని కేసు పెట్టేశారు.