రఘురామకృష్ణరాజును అరెస్ట్ చేయడంపై పవన్ కల్యాణ్ స్పందించారు. ఇది కరెక్ట్ సమయం కాదని .. ముందు కోవిడ్ రోగుల గురించి పట్టించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే.. పవన్ కల్యాణ్ లేఖపై వైసీపీ సోషల్ మీడియా వింగ్ ఒక్క సారిగా ఎదురుదాడి చేసింది. ఆ ఎదురుదాడిలో ఒకే పాయింట్ కనిపిస్తోంది. అదే.. సరిహద్దుల్లో అంబులెన్స్‌లను తెలంగాణ సర్కార్ నిలిపివేస్తూంటే… స్పందించని పవన్ కల్యాణ్.. అదే రఘురామకృష్ణరాజును అరెస్ట్ చేస్తే మాత్రం.. స్పందించారని.. ఆయనకు ప్రజల సమస్యలు పట్టవనేది ఆ విమర్శల సారాంశం.
వైసీపీ ఎదురుదాడిని జనసేన నేతలు ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఎందుకంటే… అంబులెన్స్‌ల నిలిపివేత అంశంపై పవన్ కల్యాణ్ స్పందించలేదు నిజమే కానీ.. అధికార పార్టీగా వైసీపీ స్పందించిందా అని వారు ప్రశ్నిస్తున్నారు. ప్రతిపక్షాలు కేవలం ప్రకటనలు చేయగలవు.. కానీ అధికార పార్టీకి.. సమస్యను పరిష్కరించే.. అధికారం ఉంది. కానీ.. సరిహద్దుల్లో రోగులు చనిపోతున్నా.. పట్టించుకోని ప్రభుత్వం… అదే దారి గుండి సీఐడీ అధికారుల్ని పంపి.. రఘురామకృష్ణరాజును అరెస్ట్ చేసి తీసుకెళ్లారు.
ఆ అరెస్ట్ సంగతి పక్కన పెడితే.. కనీసం.. తెలంగాణ సీఎం కేసీఆర్‌తో కూడా.. జగన్ ఎందుకు మాట్లాడే ప్రయత్నం చేయలేదన్నది చాలా మంది వాదన. ఇదే ప్రధానంగా జనసైనికులు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. ప్రజల్ని కరోనాకు వదిలేసి.. సొంత రాజకీయాలు చేసుకుంటున్న అధికార పార్టీ.. విపక్షాలపై అదే రీతిలో ఎదురుదాడి చేయడం.. హాస్యస్పదంగా ఉందంటున్నారు. ఇదేం రాజకీయం అని జనసైనికులు విస్తుపోతున్నారు.