మెట్రో నగరాలు ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ట్రాలు.. పూర్తిగా మెట్రోనే అయిన ఢిల్లీ వంటి చోట్ల పాజిటివిటీ రేటు చాలా ఎక్కువగా ఉందంటే.. ఓ అర్థం ఉంది. అక్కడ జనాభా సాంద్రత… జీవన విధానం.. వల్ల.. కేసులు వైరస్ పాకిపోయిందని అర్థం చేసుకోవచ్చు. కానీ ఎలాంటి మెట్రో సిటీలు లేని.. ఎక్కువగా చిన్న పట్టణాలు.. పల్లెలు ఉన్న ఆంధ్రప్రదేశ్లో పాజిటివిటీ రేటు 30 శాతానికి ఎలా చేరుకుందో.. కేంద్ర ప్రభుత్వానికి కూడా అర్థం కావడం లేదు. కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ పరిస్థితి ఆందోళనకరం అని.. మీడియాతోనే వ్యాఖ్యానించారంటే….. డేంజర్ జోన్లోకి ఏపీ చేరుకుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
అదే సమయంలో కరోనా మరణాల సంఖ్య సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. దేశంలో చాలా రాష్ట్రాల్లో ఇప్పుడు కరోనా ఇప్పుడు విజృంభణ తగ్గింది. రోజువారీ కేసులు దిగి వస్తున్నాయి. కానీ ఏపీలో మాత్రం ఊహించని స్థాయిలో పెరిగింది. ప్రభుత్వం మాత్రం.. టెస్టులు ఎక్కువగా చేస్తున్నాం కాబట్టి.. ఎక్కువ కేసులు నమోదవుతున్నాయనే వాదన వినిపిస్తున్నారు. కానీ .. టెస్టుల్ని బట్టి చూసే పాజిటివిటీ రేటు.. ఏపీలో ముఫ్పై శాతం వరకూ ఉంది. అంటే టెస్టు చేసిన ప్రతి వంద మందిలో ముఫ్పై మందికి పాజిటివ్ అన్నమాట. ఏపీ సర్కార్ కర్ఫ్యూ ప్రకటించి పది రోజులు అవుతోంది. కానీ కరోనా కట్టడి అవుతున్న సూచనలు ఏమీ కనిపించడం లేదు. రోజు రోజుకు రికార్డు స్థాయి కేసులు నమోదతున్నాయి.
ఏపీలో గ్రామీణ ప్రాంతాలు ఎక్కువగా ఉంటాయి. గ్రామ ప్రాంతాల్లోనూ కరోనా వైరస్ విలయ తాండవం చేస్తోంది.అక్కడి వారికి వైద్య సదుపాయాలు అందక… రికార్డులు కూడా ఎక్కడం లేదు. మరణాలు కూడా.. నమోదు కావడం లేదు. ఈ పరిస్థితిపై ప్రభుత్వం తక్షణం దృష్టి పెట్టాల్సిన అవసరం కనిపిస్తోంది. లేకపోతే.. ప్రజలు.. తీవ్రంగా ఇబ్బంది పడతారు. భవిష్యత్లో రాష్ట్ర ప్రగతిపైనాఈ కరోనా తీవ్ర ప్రభావం చూపుతుందన్న అంచనాలున్నాయి. వీలైనంత వరకూ గ్రామ ప్రాంతాల్లో కరోనా కట్టడిపై ప్రభుత్వం దృష్టి పెట్టాల్సి ఉంది.