రఘురామకృష్ణరాజు కాళ్లకు ఉన్న దెబ్బల గురించి టెస్టులు చేసి నివేదిక ఇవ్వాలని సీఐడీ కోర్టు.. హైకోర్టులు ఆదేశించాయి. వైద్యులు నివేదికల కోసం.. కోర్టు ఇచ్చిన సమయం దాటి మరీ టెస్టులు చేస్తున్నారు. నివేదికలు ఎప్పుడు సబ్మిట్ చేస్తారో తెలియదు కానీ.. ఏపీ నెంబర్ వన్ చానల్ టీవీ9 మాత్రం.. ప్రాథమిక నివేదిక ప్రకటించేసింది. రఘురమకృష్ణరాజు కాళ్లకు దెబ్బలు సొరియాసిస్ అనే వ్యాధి వల్ల వచ్చాయట. ఈ విషయాన్ని బ్రేకింగ్‌లు వేసి మరీ.. చెప్పింది. రఘురామకృష్ణరాజు సొరియాసిస్‌తో బాధపడుతున్నారని… అందుకే చర్మవ్యాధుల నిపుణులు కూడా వచ్చి … రఘురామకృష్ణరాజు కాళ్లను పరిశీలిస్తున్నారని టీవీ9 బ్రేకింగ్‌ల సారాంశం.
టీవీ9 అంటే ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. అధికార పార్టీల రాజకీయ వ్యూహాల్లో భాగంగా.. వారికి కావాల్సిన విధంగా ఇతరులపై బురద చల్లడానికి.. ఎలాంటి రూల్స్ పెట్టుకోకుండా వార్తలు ప్రసారం చేయడంలో టీవీ9 ముందుంది. ఇప్పుడు.. రఘురామకృష్ణరాజుకు సొరియాసిస్ అని ముందుగానే చెప్పడం వల్ల.. సాయంత్రానికి రిపోర్ట్ కూడా అలాగే వస్తుందని హింటిచ్చిందన్నమాట.
కోర్టు.. మెడికల్ బోర్డును ఏర్పాటు చేసి టెస్టులు చేయమని ఆదేశించింది. అటు గవర్నమెంట్ ఆస్పత్రితో పాటు ఇటు రమేష్ హాస్పిటల్లోనూ టెస్టులు చేయించమన్నది. అసలు టెస్టులు జరుగుతున్నాయో లేదో కానీ.. మొత్తానికి టీవీ9 మాత్రం ప్రాథమిక నివేదిక బయట పెట్టేసి అందర్నీ ఆశ్చర్య పరిచేసింది. ఎంతైనా నెంబర్ వన్ చానల్ కదా..!?