మనకున్న సెన్సిబుల్ డైరెక్టర్లలో శ్రీకాంత్ అడ్డాల ఒకరు. తనది కాని దారిలో వెళ్లి… ఇప్పుడు ఓ రీమేక్ కథని తెరకెక్కించారు. అదే.. `నారప్ప`. అసురన్కి ఇది రీమేక్. అసురన్ ఓ `రా` సబ్జెక్ట్. దాన్ని కుటుంబ కథా చిత్రాల దర్శకుడిగా పేరొందిన.. శ్రీకాంత్ అడ్డాల ఎలా డీల్ చేశాడా? అనే ఆసక్తి నెలకొంది. అయితే ఇంతలోనే మరో రీమేక్ కూడా శ్రీకాంత్ అడ్డాల చేతిలి చిక్కిందని టాక్. అదే.. `కర్ణన్`.
తమిళంలో విడుదలై.. విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్న చిత్రం `కర్ణన్`. ఈ సినిమా రీమేక్ రైట్స్ బెల్లంకొండ శ్రీనివాస్ చేతికి అందాయి. ఇప్పుడు ఈ కథని డీల్ చేసే దర్శకుడి కోసం అన్వేషిస్తున్నాడు. అందులో భాగంగా.. శ్రీకాంత్ అడ్డాలని సంప్రదించినట్టు తెలుస్తోంది. `అసురన్` రీమేక్ ని శ్రీకాంత్ బాగా డీల్ చేశాడన్న టాక్ రావడంతో… బెల్లంకొండ తన తొలి ఆప్షన్ గా… శ్రీకాంత్ అడ్డాల ని ఎంచుకున్నాడని టాక్. సినిమా తీసి, ఫస్ట్ కాపీ ఇచ్చే పద్ధతిన ఓ ప్యాకేజీలా ఈ సినిమాని మాట్లాడేసుకుని, డీల్ క్లోజ్ చేయాలని బెల్లంకొండ భావిస్తున్నాడు. అయితే శ్రీకాంత్ అడ్డాల ఆలోచనలు వేరుగా ఉన్నాయి. `నారప్ప` విడుదలై.. ఫలితం డిసైడ్ అయ్యేంత వరకూ తదుపరి సినిమా గురించి ఆలోచించకూడదనుకుంటున్నాడట. ఒకవేళ నారప్ప సక్సెస్ అయితే… రీమేక్ సినిమాల్ని హ్యాండిల్ చేయగలడన్న పేరొస్తుంది. అప్పుడు ఎలాంటి స్టెప్ వేసినా ఫర్వాలేదు. ముందే కమిట్ అయితే, తరవాత ఇబ్బంది పడాల్సివస్తుందని, తన నిర్ణయాన్ని హోల్డ్ చేసి పెట్టాడని టాక్.