సమంత తమిళనాడులో సెగలు రేపుతున్నారు. అయితే గ్లామర్‌తో కాదు. ఈ సారి సీరియస్ ఇష్యూతో. ఆమెకు పుట్టి పెరిగిన తమిళనాడు నుంచి బెదిరింపులు కూడా వస్తున్నాయి. దీనికి కారణం ఫ్యామిలీ మెన్ సెకండ్ సీజన్ వెబ్ సీరిసే. బుధవారం ట్రైలర్ విడుదల కాగానే తమిళులు సోషల్ మీడియాలో ఫైర్ అవడం ప్రారంభించారు. ట్రైలర్ ప్రకారం సమంత.. ఒక తమిళ ఆత్మాహుతి దళ సభ్యురాలిగా కనిపిస్తున్నారు. అందరినీ చంపేస్తానని డైలాగ్స్ కూడా ట్రైలర్‌లో ఉన్నాయి.
చూడటానికి డిటెక్టివ్ స్టోరీగా కనిపించినా.. అందులో శ్రీలంక తమిళుల కథ అని,… రాజీవ్ గాంధీ హత్యలో పాలు పంచుకున్న ఎల్టీటీఈ ఆత్మాహుతి దళ సభ్యురాలు థానును పోలిన క్యారెక్టర్ సమంతదని రివ్యూలు రాసేస్తున్నారు. శ్రీలంక తమిళుల చరిత్రను వక్రీకరించడమే కాకుండా.. చరిత్ర తెలియని వారు ఈ సిరీస్ తీస్తున్నారని తమిళ మేథావుల ఆరోపణ. ఎల్టీటీఈ వ్యవస్థాపకుడు ప్రభాకరన్‌ను తమిళులు.. స్వాతంత్ర సమరయోధుడిగా భావిస్తున్నారని, వెబ్ సిరీస్ నిర్వాహకులు మాత్రం ఆయన్ను ఉగ్రవాదిగా చూపేందుకు ప్రయత్నిస్తున్నారని తమిళనాడు నుంచి వస్తున్న ఫీడ్ బ్యాక్.
తమిళనాడులో పుట్టి పెరిగిన సమంత తమిళుల చరిత్ర తెలిసి కూడా.. ఇలాంటి వెబ్ సరీస్‌లో ఎలా నటిస్తారని కొందరు ప్రశ్నిస్తున్నారు. షేమ్ ఆన్ యూ.. అంటూ సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టి…. ది ఫ్యామిలీ మ్యాన్ టూ.. వెబ్ సిరీస్ యూనిట్‌పై విరుచుకుపడుతున్నారు. తమిళులందరూ… అమెజాన్ ప్రైమ్‌ను బాయ్ కాట్ చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఈ అంశంపై సమంత కానీ అమెజాన్ కానీ ఇంకా స్పందించలేదు. వివాదం మరింత ముదిరిన తర్వాత ఏమైనా ప్రకటన చేస్తారేమో చూడాలి.