మిగిలిపోయిన ఐపీఎల్‌ను ఇంగ్లాండ్‌లో నిర్వహించాలని బీసీసీఐ దాదాపుగా ఓ నిర్ణయానికి వచ్చింది. ఇరవై తొమ్మిదో తేదీన బీసీసీఐ సమావేశంలో ఆమోద ముద్ర వేసే అవకాశం ఉంది. నిజానికి ఇండియా నుంచి ఎవర్నైనా ఆటగాళ్లను తమ దేశాల్లోకి రానివ్వడానికి ఇతర దేశాలు జంకుతున్నాయి. ఇండియాలో కరోనా ఉద్ధృతి ఆస్థాయిలో ఉండటమే కారణం. ఇంగ్లాండ్ కూడాదానికి మినహాయింపు కాదు. అయితే అదృష్టవశాత్తూ… టెస్ట్ ప్రపంచకప్ ఫైనల్ భారత్, న్యూజిలాండ్ మధ్య ఇంగ్లాండ్‌లోనే జరగనుంది.దీని కోసం ప్లేయర్లు ముందుగానే అక్కడకు చేరుకుంటున్నారు. మరో టీంను శ్రీలంకకు పంపుతున్నారు. దీంతో.. ఇతర ఆటగాళ్లను కూడా.. ఇంగ్లాండ్‌కు చేర్చడానికి పెద్ద సమస్య ఉండదని భావిస్తున్నారు. ఇప్పటికే ఆసియాకప్‌ను రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించారు.
మధ్యలో ఆగిపోయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ను విదేశాల్లో అయినా నిర్వహించి తీరాలన్న పట్టుదలతో బీసీసీఐ ఉంది. టోర్నీని రద్దు చేస్తే.. జరిగే నష్టం.. రెండున్నర వేల కోట్లుగా తేలింది. ఇంత నష్టాన్ని భరించడం కన్నా.. ఏదో విధంగా టోర్నీ నిర్వహించాలన్న ఆలోచనలో బీసీసీఐ ఉంది. ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతంగా ఉంది. ప్రస్తుత పరిస్థితి చూస్తూంటే… తగ్గేలా లేదు.. ధర్డ్ వేవ్ వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఇండియాలో టోర్నీ కొనసాగించడం అసాధ్యం. ఒక వేళ కంట్రోల్ అయినా… ఈ సీజన్లో ఆటగాళ్లు ఇండియాకు రావడానికి ఇష్టపడరు.
ఇండియాలోనే సెకండ్ వేవ్ కల్లోలం రేపుతోంది. ఇతర దేశాల్లో లేదు. తమ దేశంలో ఐపీఎల్ నిర్వహించుకోవడానికి అనుమతి ఇస్తామని ఇంగ్లాండ్ హామీ ఇచ్చింది. అదే సమయంలో శ్రీలంక కూడా ఆఫర్ ఇచ్చింది. బీసీసీఐ మాత్రం ఇంగ్లాండ్‌ను ఎంచుకున్నట్లుగా కనిపిస్తోంది. ఇప్పటి వరకూ ఐపీఎల్ ఎప్పుడూ మధ్యలో ఆగిపోలేదు. ముందే సమస్యలు రావడంతో రెండు సార్లు ఓ సారి దక్షిణాఫ్రికాలో..మరోసారి దుబాయ్‌లో నిర్వహించారు. వేల కోట్లతో ముడిపడిన వ్యవహారం కాబట్టి… తల్చుకుంటే అయిపోతుందని.. ఇంగ్లాండ్‌లో జరిగి తీరుతుందని కొంత మంది గట్టిగా నమ్ముతున్నారు. బీసీసీఐ కూడా అదే పట్టుదలతో ఉంది.