స్టేట్ ఎలక్షన్ కమిషనర్‌గా నీలం సాహ్ని పదవీ సమర్థతపై హైకోర్టు అనుమానాలు వ్యక్తం చేసిన ఒక్క రోజులోనే .. ఆమె నియామకం చట్టవిరుద్ధమంటూ అదే హైకోర్టులో పిటిషన్ దాఖలు కావడం సంచలనం సృష్టిస్తోంది. ఈ అంశంపై హైకోర్టు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. దీనికి పిటిషన్‌గతంలో సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను జత పరిచారు. ఆ ఉత్తర్వుల ప్రకారం… నీలం సాహ్ని నియామకం ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. సుప్రీంకోర్టు తీర్పునే ధిక్కరించినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నీలం సాహ్ని పదవికి ఇప్పుడు అసలైన గండం పొంచి ఉందని న్యాయనిపుణులు వేస్తున్నారు.
కొద్ది రోజుల కిందట గోవా ప్రభుత్వం స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర న్యాయ కార్యదర్శిగా ఉన్న వ్యక్తికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ఇది రాజ్యాంగ విరుద్ధమని హైకోర్టు స్టే ఇచ్చింది. దీనిపై గోవా ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఈ కేసు విచారణను చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం.. ఎన్నికల కమిషన్ వ్యవహారాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోకూడదని స్పష్టం చేసింది. ఆ తీర్పు సమయంలోనే కొన్ని కీలకమైన అభిప్రాయాలను సుప్రీంకోర్టు వెల్లడించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారి లేదా ఆయా ప్రభుత్వంతో సంబంధమున్న వ్యక్తి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా పనిచేయకూడదని.. ఆ స్థానంలో స్వతంత్ర వ్యక్తి ఉండాలని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. ప్రభుత్వాలకు సంబంధం లేని స్వతంత్ర వ్యక్తులు ఎన్నికల కమిషనర్లుగా ఉండాలి. ప్రభుత్వంలో ఎలాంటి బాధ్యతలు చేపడుతోన్న వ్యక్తిని కూడా ఆ స్థానంలో నియమించకూడదని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది.
నీలం సహానిని ఏపీ సర్కార్ నియమించాలని అనుకున్నప్పుడు.. ఈ అంశం చర్చనీయాంశమయింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు విరుద్ధంగా నియమిస్తున్నారని.. తిరుస్కరించాలని కొంత మంది గవర్నర్‌కు విజ్ఞప్తులు కూడా చేశారు. కానీ.. నియామకం జరిగిపోయింది. అయితే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పదవిలో ఉన్న అధికారుల్ని నియమించడానికే వర్తిస్తుందని.. రిటైరన వారికి కాదని.. కొంత మంది న్యాయనిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో… ప్రభుత్వం దాఖలు చేసే కౌంటర్ ను బట్టే నీలం సాహ్ని పదవి ఉంటుందా.. లేదా అనేది తేలే అవకాశం ఉంది.