వివాదాస్పద వ్యాఖ్యలు.. అర్థంపర్థం లేని విశ్లేషణలు చేస్తూ.. అనందయ్య మందు పెద్ద ఫ్రాడ్ అని చెప్పేందుకు తాపత్రయ పడుతున్న టీవీ9కి బ్యాడ్ ఫీడ్ బ్యాక్ వస్తోంది. రాజకీయ అంశాలపై ఎలాంటి వార్తలువేసినా… ఓ వర్గం మద్దతు ఖచ్చితంగా లభించేది. తప్పుడు ప్రచారాలు చేసినా.. అసలు చేయకపోయినా… ఓ వర్గం మాత్రం ఎప్పుడూ సపోర్ట్‌గా ఉంటుంది. అనూహ్యంగా ఆనందయ్య మందు విషయంలో… టీవీ9 అత్యుత్సాహానికి అవ్ని వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆనందయ్య మందు ఆగిపోవడానికి టీవీ9నే కారణం అన్న చర్చ ఇప్పుడు సామాన్య జనంలో ప్రారంభమయింది.
కరోనాకు కృష్ణపట్నం ఆనందయ్య మందుఅనేదానిపై మొదటి నుంచి సానుకూల ప్రచారమే జరిగింది. ఆ ప్రచారం వల్లనే పెద్ద ఎత్తున జనం కృష్ణపట్నం వెళ్తున్నారు. ఎప్పుడు అయితే టీవీ9రంగంలోకి దిగి.. అది పసరు మందు..దాని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయన్న ప్రచారం ప్రారంభించిందో… అప్పుడే సమస్య జఠిలం అయింది. టీవీ9తో పోటీగా.. సోషల్ మీడియాలో ఆనందయ్య మందుకుపాజిటివ్ ఫీడ్ బ్యాక్ ఇచ్చేందుకు ఎక్కువ మంది పోటీపడ్డారు. పనిలో పనిగా టీవీ9పై అదే పనిగా విరుచుకుపడటం ప్రారంభించారు. మెడికల్ మాఫియాకు టీవీ9 మద్దతు ప్రకటిస్తోందని… టీవీ9ది కుట్ర అని విమర్శించడం ప్రారంభించారు.
కొన్నిచోట్ల బ్యాన్ టీవీ9 అనే నినాదం కూడా వినిపిస్తోంది. రాజకీయాలకు సంబంధం లేకుండా.. టీవీ9ను బ్యాన్ చేయాలి అనే నినాదం రావడం ఇదే మొదటి సారి. కరోనా దెబ్బకు లక్షలకు లక్షలు ఆస్పత్రులకు కట్టిన, కడుతున్న, కట్టాల్సి వస్తుందేమో అని భయపడుతున్న వర్గాలకు టీవీ9 వార్తలు చాలా కోపం తెప్పిస్తున్నాయి. ఓ చిన్న మందుపై… పెద్ద కుట్ర చేస్తున్నారన్న అభిప్రాయానికి వచ్చారు. ఇది ఆ చానల్‌కు మైనస్ అయింది. అదే సమయంలో చర్చా కార్యక్రమాల్లో ఆ మందుకు వ్యతిరేకంగా మాట్లాడేవారికి ప్రాధాన్యం ఇస్తూ… ఆ మంద ువల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేవని చెప్పేందుకు మాత్రం తటపటాయిస్తోంది.
వివాదాలతో రేటింగ్స్ తెచ్చుకోవడం టీవీ9కి కొత్త కాదు. కానీ సెంటిమెంట్స్‌ను వివాదాస్పదం చేస్తే.. మొదటికే మోసం వస్తుంది. నోటి అదుపులేని యాంకర్లు ఆనందయ్య మందును రకరకాలుగా వరిస్తూ ఉండటంతో పరిస్థితి మరింత సీరియస్‌గా మారుతోంది.