రఘురామకృష్ణరాజుకు ఆర్మీ కష్టాలు ఎదురవుతున్నారు. ఆర్మీలో రూల్స్ అంటే రూల్స్, అక్కడ చికిత్స పొందుతున్న రఘురామకృష్ణరాజుకు ఇప్పుడే పరిస్థితి అర్థమవుతోంది. ఆయనకు సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చినా.. మోర నాలుగైదు రోజుల పాటు ఆయన ఆస్పత్రిలోనే చికిత్స చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎంపీ రఘురామకృష్ణరాజు బెయిల్ ప్రాసెస్… మరికొద్ది రోజుల పాటు సాగనుంది. శుక్రవారం బెయిల్ రావడంతో బెయిల్ పత్రాలు… ష్యూరిటీలు సమర్పించడానికి రఘురామ తరపు లాయర్లకు అవకాశం చిక్కలేదు.
సుప్రీంకోర్టు.. పత్రాలు మొత్తాన్ని సీఐడీ కోర్టులో సమర్పించి.. బెయిల్ తీసుకోవాలని ఆదేశించింది. అయితే ఇక్కడ సాంకేతికపరమైన చిక్కులు ఏర్పడ్డాయి. బెయిల్ మంజూరు చేయాలంటే.. జత చేయాల్సిన పత్రాల్లో ఆర్మీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్లుగా పత్రం ఉండాలి. ఆ డిశ్చార్జ్ సమ్మరీ కోసం… రఘురామకృష్ణరాజు తరపు వ్యక్తులు ఆర్మీ ఆస్పత్రి వర్గాలను సంప్రదిస్తే… మరో నాలుగు రోజులు పడుతుందని తేల్చి చెప్పారు. రఘురామకృష్ణరాజుకు.. ఆర్మీ తరహాలో చికిత్స అందిస్తున్నారు. అన్ని రకాల టెస్టులు చేసి.. దానికి తగ్గట్లుగా చికిత్స అందిస్తున్నారు. డిశ్చార్జ్ చేయడానికి మరో నాలుగు రోజులు పడుతుందని ఆర్మీ వైద్యులు తేల్చి చెప్పినట్లుగా తెలుస్తోంది. దీంతో.. సీఐడీ కోర్టులో… అవసరమైన పత్రాలను సమర్పించలేకపోయారు.
ఆర్మీ ఆస్పత్రి వైద్యులు ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తే అప్పుడే… ఆ బెయిల్ పత్రాలను సీఐడీ కోర్టులో సమర్పించి.. అధికారికంగా బెయిల్ ఆదేశాలు తెచ్చుకోవాల్సి ఉంటుంది. దీంతో ఎంపీ రఘురామ… మరికొంత కాలం అధికారింగా రిలీజ్ కావడానికి సమయం పట్టే అవకాశం ఉంది. అప్పటి వరకూ ఆయన జ్యూడిషియల్ కస్టడీలోనే ఉన్నట్లుగా భావిస్తారు. మామూలుగా ఇతర ఆస్పత్రుల్లో అయితే… ఎంత సీరియస్గా ఉందని అప్పటి వరకూ ప్రచారం చేసినా.. బెయిల్ వచ్చిందనగానే.. వెంటనే డిశ్చార్జ్ అయిపోయేవారు. కానీ ఆర్మీలో మాత్రం అది సాధ్యం కాదని తేలిపోయింది. వీఐపీలకైనా అదే ట్రీట్మెంట్.