ఉప్పల్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డిపై భూకబ్జా కేసు నమోదైంది. కాప్రాలో సర్వే నెం.152లో 90 ఎకరాల భూవివాదంలో జోక్యం చేసుకుని ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డి డబ్బులు డిమాండ్ చేశారని మేకల శ్రీనివాస్ యాదవ్ అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. పోలీసులను సంప్రదించినా ప్రయోజనం లేకపోవడంతో ఆయన ఆధారాలతో సహా కోర్టుకెళ్లారు. కోర్టు ఆదేశాలతో ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డిపై కేసు నమోదు చేయక తప్పలేదు. అయితే ఈ కేసు మామూలుగా అయితే సాధారణమైంతే కానీ.. ఈటల విషయంలో కోర్టులు ఆదేశించకముందే.. ఇలా బాధితుల పేరుతో ఎవరో ఒకరు ఫిర్యాదు చేయగానే కేసీఆర్.. అలాఅన్ని రకాల విచారణలకూ ఆదేశిస్తున్నారు. అందుకే సుభాష్ రెడ్డి అంశం హాట్ టాపిక్ అవుతోంది. ఆయనపై ఎం చర్యలు తీసుకుంటారన్న ఉత్కంఠ తెలంగాణ రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుోతంది.
అవినీతికి పాల్పడితే బిడ్డనైనా వదిలిపెట్టని కేసీఆర్ ఆరేడేళ్ల కిందట.. గంభీరమైన డైలాగ్ చెప్పారు. ఇప్పుడు ఆ డైలాగ్‌ను తరచూ చాలా మంది గుర్తు చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఈటల రాజేందర్ ఇష్యూలో ఆయనపై అన్ని రకాల రాష్ట్ర దర్యాప్తు సంస్థలు విరుచుకుపడుతున్న సమయంలో… బిడ్డల సంగతి సరే కానీ.. ఇతర టీఆర్ఎస్ నేతల అవినీతి.. కబ్జా సంగతేమిటన్న ప్రశ్నలు తరచూ వినిపిస్తున్నాయి. దీనికి కారణం… టీఆర్ఎస్ నేతలపై దాఖలవుతున్న కేసులు… కోర్టులు ఆదేశించినా సాంకేతికంగా నమోదవుతున్నాయి తప్ప.. వాటిపై చర్యలు ఉండటం లేదు. మంత్రి మల్లారెడ్డి దగ్గర్నుంచి అనేక మంది టీఆర్ఎస్ నేతలపై భూకబ్జా ఆరోపణలు ఉన్నాయి. కానీ టీఆర్ఎస్ సర్కార్ పట్టించుకోవడం లేదు.
ముఖ్యమంత్రి కేసీఆర్.. అసైన్డ్ భూముల అంశాన్ని ఉపయోగించి ఊటలను టార్గెట్ చేయడంతో ఆ భూముల విషయంలో ఇతర టీఆర్ఎస్ నేతలపై ఉన్న వాటిపైనా విచారణ చేయాలన్న డిమాండ్లు వినిపించాయి. ఆ తర్వాత మేడ్చల్ సీతారామచంద్ర స్వామి ఆలయ భూముల విషయంలోనూ అంతే. అక్కడా టీఆర్ఎస్ నేతల ప్రమేయం ఉందన్న ఆరోపణలు వచ్చాయి. కానీ ప్రభుత్వం మాత్రం ఒక్క ఈటలనే టార్గెట్ చేసింది. ఇప్పుడు.. కోర్టులు ఆదేశిస్తున్నా… ఎమ్మెల్యేలు.. మంత్రులపై తూ..తూ మంత్రం కేసులే నమోదవుతున్నాయి.