సోషల్ మీడియా మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌ను కంట్రోల్ చేయడానికి.. తమకు అనుకూలంగా మాత్రమే ఉండేలా చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం చీప్ ట్రిక్స్ ప్లే చేస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఢిల్లీ, గుర్గావ్లలో ఉన్న ట్విట్టర్ ఇండియా కార్యాలయాల్లో ఢిల్లీకి చెందిన స్పెషల్ బ్రాంచ్ పోలీసులు హఠాత్తుగా సోదాలు చేశారు. నిజానికి ఆయా కార్యాలయాల నుంచి ఇప్పుడు పనులు జరగడం లేదు. ఉద్యోగలందరూ వర్క్ ఫ్రం హోం పని చేస్తున్నారు. అయితే.. పోలీసులు మాత్రం .. ఆయా కార్యాలయాల్లో సోదాలు చేసి కాస్త గందరగోళం సృష్టించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
ట్విట్టర్‌కు.. కేంద్ర ప్రభుత్వానికి రెండు, మూడు రోజులుగా వివాదం నడుస్తోంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినది అంటూ.. ఓ టూల్‌కిట్‌నూ బీజేపీ నేతలు ప్రచారంలోకి తీసుకు వచ్చారు. దాని ప్రకారం.. దేశానికి చెడ్డపేరు తెచ్చేందుకు కాంగ్రెస్ టూల్ కిట్ రూపొందించిందని బీజేపీ నేతలు ట్వీట్లు చేయడం ప్రారంభించారు. అయితే… ట్విట్టర్ అలాంటి ట్వీట్లకు మ్యానిపులేటెడ్ మీడియా అనే ట్యాగ్‌ను జత చేస్తోంది. ముఖ్యంగా ఫేక్ న్యూస్ పోస్ట్ చేయడంలో సిద్ధహస్తుడైన .. ఆ పార్టీ నేత సంబిత్ పాత్ర.. ఈ టూల్ కిట్ పై కాంగ్రెస్ వ్యతిరేక ప్రచారానికి నేతృత్వం వహిస్తున్నారు. ఆయన ట్విట్టర్ అకౌంట్‌కు మ్యానిపులేటెడ్ మీడియా అని ట్యాగ్ పెట్టడం … కేంద్ర ప్రభుత్వానికి కోపం తెప్పించింది. అది తీసేయాలని.. నేరుగా కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాదే నేరుగా హెచ్చరికలా జారీ చేశారు. అయితే ట్విట్టర్ మాత్రం డోంట్ కేర్ అన్నది. తమ విధానాల్లో మార్పు రాదని స్పష్టం చేసింది.
ఇది బీజేపీ అహన్ని.. కేంద్ర ప్రభుత్వ అహన్ని మరింత దెబ్బతీసినట్లయింది. వెంటనే… పోలీసులు రంగంలోకి దిగారు. ట్విట్టర్ కార్యాలయాల్లో సోదాలు ప్రారంభించారు. ఎందుకంటే.. సంబిత్ పాత్ర పోస్ట్ చేసిన ట్వీట్ మ్యానిపులేటెడ్ అని తెలుసుకోవడానికి ఆధారాల కోసం వచ్చామని చెబుతున్నారు. పోలీసుల తీరు… సోషల్ మీడియా వర్గాల్లో చర్చనీయాంశమయింది.
మరో వైపు కాంగ్రెస్ పార్టీ లెటర్ హెడ్‌ను ఫోర్జరీ చేసి.. తప్పుడు ప్రచారాలు చేస్తున్నారంటూ.. సంబిత్ పాత్రపై పలు చోట్ల కాంగ్రెస్ నేతలు కేసులు పెడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న చత్తీస్ఘడ్ోలనూ కేసు నమోదు చేశారు. అక్కడి పోలీసులు ఆయనకు సమన్లు జారీ చేస్తే.. కరోనా ఆపన్నులకు సేవలు అందించే ప్రయత్నంలో బిజీగా ఉన్నానని.. రాలేనని లాయర్ ద్వారా సమాచారం పంపారు. మొత్తానికి ప్రస్తుత పరిస్థితిని ఫేక్ న్యూస్ ద్వారా.. కాంగ్రెస్ పై నిందలేయడం ద్వారా… తప్పించుకోవాలని బీజేపీ అనుకుంటోందన్న విమర్శలు మాత్రం గట్టిగా వినిపిస్తున్నాయి.