వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ వచ్చే నెల ఒకటో తేదీకి వాయిదా పడింది. కౌంటర్ దాఖలు చేయడానికి వరుసగా మూడో సారి కూడా సీబీఐతో పాటు జగన్ కూడా… వాయిదా కోరారు. రెండు వర్గాలు కూడబలుక్కున్నట్లుగా పదే పదే వాయిదాలు కోరడంపై న్యాయనిపుణులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి గత వాయిదాలో సీబీఐ కోర్టు చాలా సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చింది. ఇదే చివరి అవకాశమని.. ఎట్టి పరిస్థితుల్లోనూ స్పష్టం చేసింది. అయినప్పటికీ సీబీఐ కోర్టు న్యాయమూర్తి హచ్చరికలను లైట్ తీసుకున్న న్యాయమూర్తులు లాక్ డౌన్ కారణంగా కౌంటర్ దాఖలు చేయలేకపోతున్నామంటూ చెప్పుకొచ్చారు.
న్యాయమూర్తి మరోసారి ఇదే చివరి అవకాశమని అటు సీబీఐతో పాటు ఇటు జగన్ తరపు లాయర్లకు తేల్చి చెప్పారు. ఈ సారి కౌంటర్ దాఖలు చేయకపోతే.. విచారణ ప్రారంభిస్తామని ప్రకటించారు. లాక్ డౌన్ అనేది కారణమేనని.. కౌంటర్ రెడీగా ఉంటే ఈ మెయిల్ చేయవచ్చునని రఘురామకృష్ణరాజు తరపు న్యాయవాది వాదించారు. అయితే వారి వైపు నుంచి స్పందన లేదు. సీబీఐ కూడా అదే పనిగా ఎందుకు వాయిదా కోరుతున్నారో అర్థం కావడం లేదని.. రఘురామ తరపు న్యాయవాది అసహనం వ్యక్తం చేశారు. ఇలా వాయిదాలు కోరుతూ… తమ క్లయింట్‌ను హింసిస్తున్నారని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
సీబీఐ కొత్త చీఫ్‌గా జైస్వాల్ బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఆర్థిక నేరస్తుల పట్ల ఆయన చాలా కఠినంగా ఉంటారన్న ప్రచారం ఉంది. స్టాంపుల కుంభకోణంలో తెల్గీని జైలుపాలు చేసిన ఘనత ఆయనదే. ఇప్పుడు..సీబీఐలో చురుకుదనం ప్రారంభమయ్యే చాన్స్ ఉందని అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి బెయిల్ పిటిషన్ భవిష్యత్ ఎక్కువగా సీబీఐ కౌంటర్ మీదే ఆధారపడి ఉంది. జగన్ బెయిల్ షరుతులు ఉల్లంఘించారని సీబీఐ స్పష్టం చేస్తే కేసుకు బ0లం పెరుగుతుంది.