థియేటర్లు మూతబడిన వేళ… ఓటీటీ వేదికలు కీలకమైన ప్రత్యామ్నాయ మార్గాలుగా మారిపోయాయి. చిన్న, మీడియం సైజు సినిమాలు మెల్లమెల్లగా ఓటీటీ బాట పడుతున్నాయి. ఈవారంలో `ఏక్ మినీ కథ` అమేజాన్ లో విడుదల అవుతోంది. ఇప్పుడు మరో సినిమాకి ఓటీటీ నుంచి క్రేజీ ఆఫర్ వచ్చిందని సమాచారం.
రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందుతున్న చిత్రం `పెళ్లి సందడి`. శ్రీకాంత్ తనయుడు రోషన్ రీ ఎంట్రీ ఇస్తున్న సినిమా ఇది. గౌరి దర్శకత్వం వహిస్తోంది. ఈ సినిమాకి అమేజాన్, ఆహాల నుంచి క్రేజీ ఓటీటీ ఆఫర్లు వచ్చినట్టు టాక్. రూపాయికి రూపాయి లాభం వచ్చేలా… ఈ ఆఫర్లు ఉన్నాయని, ఎప్పుడైనా ఈ డీల్ ఓకే అయిపోవొచ్చని తెలుస్తోంది. ఆగస్టు వరకూ థియేటర్లు తెరచుకునే ఛాన్స్ లేదు. అప్పటి వరకూ చిన్న సినిమాల్ని కాపు కాయడం కష్టమే. ఓరకంగా.. పెళ్లిసందడికి ఇది మంచి ఆఫర్ కిందే లెక్క. మరి రాఘవేంద్రరావు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.