ప్రతి ఏడాది ప్రభుత్వాలను చికాకు పెట్టే జూనియర్ డాక్టర్లు ఈ సారి కూడా డ్యూటీలోకి దిగిపోయారు. కరోనా సమయంలో తెలంగాణ సర్కార్ ముందుగానే స్పందించి పదిహేను శాతం వరకూ స్టయిఫండ్ పెంచుతూ జీవో ఇచ్చినా.. వారు మరిన్ని డిమాండ్లతో సమ్మెలోకి వెళ్లిపోయారు. దీంతో కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయపరమైన డిమాండ్లన్నింటినీ పరిష్కరించినా ఇంకా సమ్మెకు వెళ్లడం సమంజసం కాదని..అదీ కూడా ప్రస్తుత కరోనా సమయంలో ఇలా చేయడం ద్వారా రోగుల్ని ఇబ్బంది పెట్టడమేనని.. తక్షణం అందరూ ఉద్యోగంలో చేరిపోవాలని పిలుపునిచ్చారు.
అదే సమయంలో జూనియర్ డాక్టర్ల న్యాయపరమైన డిమాండ్లను.. పెండింగ్‌లో ఉన్న సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కేసీఆర్ కరోనా కట్టడి కోసం దీర్ఘ కాలిక వ్యూహంతో వెళ్తున్నారు. కనీసం యాభై వేల మంది మెడికల్ స్టాఫ్‌ను తాత్కాలిక పద్దతిలో నియమించుకోవాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ధర్డ్ వేవ్ ఉంటుందన్న నిపుణుల హెచ్చరికలతో… ముందుకు వెళ్తున్నారు.ఇలాంటి సమయంలో జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగడంతో… ప్రధానమైన ఆస్పత్రుల్లో చాలా వరకూ… సమస్యలు తలెత్తుతున్నాయి. ఎక్కువగా కరోనా రోగుల్ని.. సీనియర్ డాక్టర్ల సాయంతో జూనియర్ వైద్యులే ట్రీట్ చేస్తూంటారు. దీంతో గందరోగళం ప్రారంభమయింది.
ఈ కారణంగా కేసీఆర్ వెంటనే స్పందించారు. మూడు, నాలుగు రోజుల కిందటే.. కేటీఆర్… జూనియర్ డాక్టర్ల స్టయిఫండ్ పెంచుతూ జీవో జారీ చేయించారు. కేసీఆర్ పిలుపుపై జీనియర్ డాక్టర్లు స్పందిస్తే సరి.. లేకపోతే.. కరోనా సమయంలో పెద్ద ఇష్యూ అయ్యే అవకాశం ఉంది. కేసీఆర్ ఆగ్రహిస్తే.. ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయన్నది ఆసక్తికరంగా మారింది. ఆర్టీసీ ఉద్యోగుల విషయంలో కఠినంగా వ్యవహరించినట్లుగా వ్యవహరిస్తే… జూనియర్ డాక్టర్లు ఇబ్బంది పడక తప్పదనే విశ్లేషణ నడుస్తోంది.