ఆనందయ్య మందును ప్రభుత్వం ఆపే వరకూ ప్రజలకు ఉచితంగానే ఇచ్చారు. ముడి సరుకుల కోసం అడవిలో ఉన్న చెట్ల మీద ఆధారపడేవారు. ఎవరైనా తృణమో..పణమో ఇస్తే.. ఇతర సామాగ్రి కొనుగోలు చేసేవారు. ప్రభుత్వం ఏ ఉద్దేశంతో ఆ పంపిణీని నిలిపివేసిందో కానీ ఇప్పుడు బ్లాక్‌లో మాత్రమే అమ్ముతున్నారు. ఆనందయ్య మందు ఒక్క డోస్‌ను రూ. పదివేలకు అమ్ముతున్నారు. ఆజ్ఞాతంలో ఆనందయ్య ఖాళీగా లేరని పెద్ద ఎత్తున మందు తయారు చేస్తున్నారని.. అలా తయరైన మందును.. విరివిగా తరలిస్తున్నారని వీడియోలు వెలుగులోకి వస్తున్నాయి.
మరో వైపు ఈ ఎపిసోడ్లో పెద్ద మనిషి పెత్తనాన్ని చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి తీసుకున్నారు. ఆయన సొంతంగా క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించేస్తున్నారు. ముందు జంతువులపై చేస్తున్నామని ఆయన ఓ ఊరూపేరూ లేని లైఫ్ సైన్స్ జంతు సంరక్షణా కేంద్రాన్ని సందర్శించారు. టీటీడీ బోర్డుమెంబర్‌గా టీటీడీ తరపున ఆ మందును తయారు చేస్తామని ప్రకటనలు కూడా చేస్తున్నారు. జంతువలపై ట్రయల్స్‌కు నెల రోజులు పడుతుందని ఓ సారి .. కేంద్రం అనుమతి ఇస్తేనే మరోసారి అని పిట్టకథలు చెబుతున్నారు. దీంతో ప్రభుత్వం.. ఆనందయ్య మందు విషయంలో చాలా పెద్ద గేమే ఆడుతోందన్న అభిప్రాయం ప్రజల్లో వినిపిస్తోంది.
ఆనందయ్య మందు వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని.. ఆయుష్ శాఖ చెప్పింది. అదే సమయంలో ఆయన వ్యాపారం కూడా చేయడం లేదు. ఉచితంగానే ఇస్తున్నారు. అలాంటి సమయంలో పంపిణీని నిలిపివేయడానికి ప్రభుత్వానికి అధికారం లేదు. కానీ ఆనందయ్యను వైసీపీ నేతలు తమ అధీనంలో ఉంచుకున్నారు. మందు తయారు చేయించుకున్నాయి. కానీ మందు కోసం ఎదురు చూస్తున్న ప్రజల్ని మాత్రం వెయిటింగ్లో పెట్టేశారు. ఎదురు చూసి.. చూసి.. వారే మర్చిపోతారని ప్రభుత్వం అనుకుంటున్నట్లుగా కనిపిస్తోంది.