తెలంగాణ రాష్ట్ర సమితిలో హుజూరాబాద్ అసెంబ్లీ ఉపఎన్నికపై చర్చ జరుగుతోంది. ఆ మాటకొస్తే… ఒక్క టీఆర్ఎస్లోనే కాదు.. మొత్తం తెలంగాణ రాజకీయంలో ఇప్పుడు.. హుజూరాబాద్ ఉపఎన్నికపై చర్చ జరుగుతోంది. అయితే ఇప్పుడు టీఆర్ఎస్ ఫుల్ స్వింగ్లో ఉంది. ఇలాంటి సమయంలో… మళ్లీ టెస్టు పెట్టుకుని… అదీ కూడా హుజూరాబాద్ వంటి విషయంలో… లేనిపోని తిప్పలను కేసీఆర్ తెచ్చుకుంటారా.. అన్నది ఆ చాలా మందిలో ఉన్న సందేహం. ప్రస్తుతానికి అయితే… ఇక ఉపఎన్నిక ఖాయం… అని టీఆర్ఎస్ నేతలు గంభీరమైన ప్రకటనలు చేస్తున్నారు. ఈటల రాజేందర్ రాజీనామా చేయకపోతే.. తామే అనర్హతా వేటు వేస్తామని ప్రచారం చేస్తున్నారు.
సొంత పార్టీ పెట్టడమా ఇతర పార్టీల్లో చేరదమా అనేదానిపై విస్తృతంగా చర్చలు జరుపుతున్న మాజీ మంత్రి ఈటల రాజేందర్ పై అనర్హతా వేటు వేస్తామని టీఆర్ఎస్ నేతలు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈటల తనంతట తానుగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడని అంటున్నారు. ఈటల తన ఎమ్మెల్యే పదవి విషయంలో ఇప్పటికే మానసికంగా సిద్ధమైపోయారు. ఇండిపెండెంట్గానో… బీజేపీ అభ్యర్థిగానో పోటీ చేయడం ఖాయమైంది. అంటే రాజీనామా చేయడం కూడా ఖాయమే. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారనే గ్రౌండ్ లో ఈటల రాజేందర్ పైన అసెంబ్లీ ద్వారా చర్యలు తీసుకోవచ్చా అనే అంశాన్ని ప్రభుత్వ పెద్దలు పరిశీలిస్తున్నారని ఆ పార్టీ నేతలు మీడియాకు లీకులు ఇచ్చారు.
హుజూరాబాద్ లో సర్పంచ్ ల దగ్గర నుంచి మిగతా ప్రజాప్రతినిధుల ను తనవైపుకు తిప్పుకుంటున్న టీఆర్ఎస్ నేతలు.. ఆపని లాక్ డౌన్ లోపు పూర్తి చేసి .. లాక్ డౌన్ ముగిసిన వెంటనే ఈటల పై అసెంబ్లీ స్పీకర్ కు ఫిర్యాదు చేస్తామని అంటున్నారు. నిజానికి ఒక ఎమ్మెల్యే ను అనర్హుడిగా ప్రకటించడం అంత తేలిక కాదు. న్యాయపరమైన చిక్కులు వస్తాయి. అయితే.. కేసీఆర్ .. ఈటలను అనర్హుడ్ని చేయరని.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉపఎన్నిక కోరుకోరని అంటున్నారు.