నవలా చిత్రాల పరంపర ఇప్పుడు మళ్లీ మొదలైంది. క్రిష్ `కొండపొలెం` నవలని సినిమాగా మలుస్తున్న సంగతి తెలిసిందే. మరో రెండు మూడు నవలలు సినిమాలుగా మారుతున్నాయి. ఇప్పుడు మేర్లపాక గాంధీ దృష్టిలో కూడా రెండు నవలలు పడ్డాయి. వాటిని సినిమాలుగా తీయాలన్నది గాంధీ కోరిక. `ఎక్స్ప్రెస్ రాజా`, `వెంకటాద్రి ఎక్స్ప్రెస్` చిత్రాలతో విజయాలు అందుకున్నాడు గాంధీ. ఇప్పుడు `మాస్ట్రో`ని తెరకెక్కిస్తున్నాడు. నితిన్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రం `అంధాధూన్`కి రీమేక్. ఇటీవల ఓటీటీలో విడుదలైన `ఏక్ మినీ కథ`కు రచన కూడా చేశాడు. ప్రముఖ రచయిత మేర్లపాక మురళి తనయుడు గాంధీ.
తండ్రి అనేకకానేక నవలలు రాశాడు. ఆయన రాసిన నవలల్లో వీరయ్య, నిషేలను సినిమాలుగా రూపొందించాలన్న ఆలోచన… గాంధీకి ఉందదట. “నాన్నగారి రచనలు నాపై బాగా ప్రభావితం చేశాయి. ఆయన నవలలు వీరయ్య, నిషే ఇటీవలే మళ్లీ చదివాను. వీటిలో సినిమాలు అయ్యేంత స్టఫ్ ఉంది. వీలుంటే ఈ నవలల్ని సినిమాలుగా తీస్తా…“ అని చెప్పుకొచ్చాడు గాంధీ.