తన పారితోషికం విషయంలో తేడా వచ్చిందని 14 రీల్స్ కి లీగల్ నోటీసులు పంపించాడు శర్వానంద్. తన నుంచి ఇలాంటి స్టెప్ ఎవరూ ఊహించి ఉండరు. ఎందుకంటే.. ఇన్నేళ్లలో శర్వా ఎప్పుడూ వివాదాల జోలికి వెళ్లలేదు. ఎలాంటి సమస్య వచ్చినా కామ్ గా సెటిల్ చేసుకున్నాడు. 2 కోట్ల విషయంలో శర్వా నిర్మాతల్ని ఇబ్బంది పెడుతున్నాడన్నది టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యింది.
మరోవైపు… తన వల్ల నష్టాలొచ్చిన ఓ సినిమాని శర్వా ఆదుకోవడం, అందుకోసం ఫ్రీగా సినిమా చేయడం విశేషం. శర్వా కథానాయకుడిగా `పడి పడి లేచె మనసు` వచ్చింది. ఈ సినిమాపై నమ్మకంతో సుధాకర్ చెరుకూరి భారీగా ఖర్చు పెట్టారు.కానీ ఫలితం లేకుండా పోయింది. ఇప్పుడు ఆ బ్యానర్లోనే శర్వా `ఆడాళ్లూ మీకు జోహార్లూ` అనే సినిమా చేస్తున్నాడు. కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా కోసం శర్వా పారితోషికం ఏమీ తీసుకోలేదు. ఈ సినిమా హిట్టయి, లాభాలొస్తే, అందులో వాటా తీసుకుంటానన్నాడట. కేవలం… నిర్మాతని గట్టెక్కించడానికి శర్వా ఈ ప్రాజెక్టు చేస్తున్నాడు. రెండు కోట్ల కోసం.. 14 రీల్స్ తో పంతానికి దిగిన శర్వా… పైసా పారితోషికం తీసుకోకుండా ఓ సినిమా చేస్తున్నాడంటే – గొప్ప విషయమే.